iDreamPost
android-app
ios-app

ఫెడరల్ బ్యాంక్ స్మైల్ పేతో.. నవ్వితే చాలు పేమెంట్ చేయొచ్చు.. ఎలా అంటే?

Federal Bank Smilepay: పేమెంట్స్ మరింత సులభంగా చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. స్మైల్ పే పేరిట పేమెంట్ మెథడ్ ను తీసుకొచ్చింది. దీని సాయంతో స్మైల్ ఇచ్చి పేమెంట్ చేయొచ్చు.

Federal Bank Smilepay: పేమెంట్స్ మరింత సులభంగా చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. స్మైల్ పే పేరిట పేమెంట్ మెథడ్ ను తీసుకొచ్చింది. దీని సాయంతో స్మైల్ ఇచ్చి పేమెంట్ చేయొచ్చు.

ఫెడరల్ బ్యాంక్ స్మైల్ పేతో.. నవ్వితే చాలు పేమెంట్ చేయొచ్చు.. ఎలా అంటే?

డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా వేలాది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. చేతిలో నగదు ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. యూపీఐ ద్వారా ఒక్క క్లిక్ తో డబ్బు చెల్లిస్తున్నారు. ఇక బ్యాంకులు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకుని కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందిస్తున్నాయి. బ్యాంకు సేవలు దాదాపు డిజిటల్ అయిపోయాయి. ఇప్పుడు ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. స్మైల్ పే పేరిట పేమెంట్ మెథడ్ ను తీసుకొచ్చింది. దీని సాయంతో స్మైల్ ఇచ్చి పేమెంట్ చేయొచ్చు.

ఇది వరకు క్యాష్ తో పేమెంట్ చేసేవారు. ఆ తర్వాత ఆన్ లైన్ చెల్లింపులు.. డెబిట్/క్రెడిట్ కార్డులు, పేమెంట్ యాప్స్ తో ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించే వారు. ఇక ఇప్పుడు సరికొత్త పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీసుల్ని తీసుకొచ్చిన మొదటి బ్యాంకుగా ఫెడరల్ బ్యాంక్ రికార్డ్ సృష్టించింది. ఫెడరల్ బ్యాంక్ తీసుకొచ్చిన స్మైల్ పే పేమెంట్ విధానంతో సింపుల్ గా చెల్లింపులు చేయొచ్చు. పిన్, క్యూ ఆర్ కోడ్ అవసరమే లేదు. ఫేషియల్ రికగ్నిషన్ ఉంటే సరిపోతుంది. అత్యాధునిక ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీతో దీనిని యూఐడీఏఐ కి చెందిన భీమ్ ఆధార్ పే పై రూపొందించినట్లు ఫెడరల్ బ్యాంక్ స్పష్టం చేసింది. రెండు స్టెప్స్ లో పేమెంట్ కంప్లీట్ అవుతుంది.

యూఐడీఏఐ ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటాయి. మోసాలకు తావు లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇది ఫెడరల్ బ్యాంక్ కస్టమర్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం కస్టమర్లు, మర్చంట్లు ఇరువురికీ ఫెడరల్ అకౌంట్ ఉండాలి. ఫెడరల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండి ఫెడ్ మెర్చంట్ యాప్‌ని ఉపయోగిస్తున్న వ్యాపారుల వద్ద ఈ స్మైల్ పే పేమెంట్ మెథడ్ ఉపయోగించవచ్చు. ఏదైనా సరుకులు కొన్నప్పుడు, వ్యాపారి కస్టమర్ ఆధార్ కార్డు నంబర్‌ని ఆ యాప్‌లో ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఫేస్ కెమెరాతో స్కాన్ చేస్తారు. అదే వ్యక్తి అని కన్ఫర్మ్ అయ్యాక కస్టమర్ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అయి వ్యాపారి ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ. 5 వేలు.. నెలకు ఒక కస్టమర్‌కు రూ. 50 వేలు లిమిట్‌గా ఉంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది. మోసాలకు అరికట్టేందుకు బయోమెట్రిక్ ధృవీకరణను తీసుకురానుంది.