iDreamPost

ఫెడరల్ బ్యాంకు నుంచి రూపే వేవ్ Credit Card రిలీజ్.. బంపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మరో కొత్త క్రెడిట్ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. ఫెడరల్ బ్యాంక్ రూపే వేవ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. బంపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నది.

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మరో కొత్త క్రెడిట్ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. ఫెడరల్ బ్యాంక్ రూపే వేవ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. బంపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నది.

ఫెడరల్ బ్యాంకు నుంచి రూపే వేవ్ Credit Card రిలీజ్.. బంపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతున్నది. బ్యాంకులు సైతం తమ బిజినెస్ ను పెంచుకునేందుకు కస్టమర్లకు క్రెడిట్ కార్డులను రకరకాల ఆఫర్లతో ఇస్తున్నాయి. సామాన్యుల నుంచి ధనికుల వరకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను క్రెడిట్ కార్డులు తీరుస్తుండడంతో క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డు యూజర్లుకు మంచి బెనిఫిట్ కలుగుతున్నది. తాజాగా మరో కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది. ఫెడరల్ బ్యాంక్ రూపే వేవ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది.

ఒక వ్యక్తి రెండు మూడు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులను ఇష్టారీతిన వాడితే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ యూజ్ చేసుకుని సమయానికి చెల్లించకపోతే బ్యాంకులు అధిక వడ్డీతో పాటు పెనాల్టీనలు వసూలు చేస్తుంటాయి. దీంతో జేబులకు చిల్లు పడడం ఖాయం. ఏది ఏమైనా సరిగా వాడుకుంటే క్రెడిట్ కార్డ్ తో ఉపయోగాలే ఎక్కువ. ఈక్రమంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో రూపే వేవ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. తమ కస్టమర్లకు యూపీఐ ఆధారిత చెల్లింపుల సౌకర్యార్థం ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చినట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది.

ఫెడరల్ బ్యాంక్ తెచ్చిన ఈ క్రెడిట్ కార్డుతో బంపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఫెడరల్ రూపే వేవ్ క్రెడిట్ కార్డుతో ప్రతి ఐదు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. మూడు నెలల్లో రూ.50 వేలు ఖర్చు చేస్తే 1000 బోనస్ పాయింట్లు లభిస్తాయి. ప్రతి 200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్ లభిస్తుంది. షాపింగ్ దగ్గర్నుంచి హోటల్ బిల్స్ ఇలా అన్ని లావాదేవీలకు క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేసే వారికి ఈ క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉండనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి