iDreamPost

HYDలో ఇక్కడ తక్కువ ధరకే ఇళ్లు! మిడిల్ క్లాస్ వారికిదే మంచి ఛాన్స్

సొంతింటి కల ఎంతోమందికి ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అది నిజమవుతుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే అది అందుతుంది. సామాన్య, మధ్యతరగతి వాళ్ళకి మాత్రం అందని ద్రాక్ష. అయితే ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు..

సొంతింటి కల ఎంతోమందికి ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అది నిజమవుతుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే అది అందుతుంది. సామాన్య, మధ్యతరగతి వాళ్ళకి మాత్రం అందని ద్రాక్ష. అయితే ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు..

HYDలో ఇక్కడ తక్కువ ధరకే ఇళ్లు! మిడిల్ క్లాస్ వారికిదే మంచి ఛాన్స్

రేట్లు ఎలా ఉన్నా గానీ స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు కొనేవాళ్ళు ఆగడం లేదు. హైదరాబాద్ లో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 26,027 స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు 15 శాతం ఎక్కువగా జరిగాయి. 2023 జనవరి నుంచి ఏప్రిల్ నాలుగు నెలల వ్యవధిలో 22,632 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోనే ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ జిల్లాల పరిధిలో 6,578 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని.. గత ఏడాదితో పిలిస్తే 46 శాతం ఎక్కువ అని వెల్లడించింది.

తగ్గిన 1 BHK ఇళ్ల రిజిస్ట్రేషన్లు:

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3 వేలు లేదా అంతకంటే ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2 నుంచి 4 శాతానికి పెరిగాయని కంపెనీ పేర్కొంది. 2 వేల నుంచి 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్ళ రిజిస్ట్రేషన్లు 8 నుంచి 11 శాతానికి పెరిగాయని తెలిపింది. వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ళ రిజిస్ట్రేషన్లు 69 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అయితే వెయ్యి చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 20 నుంచి 16 శాతానికి పడిపోయాయని కంపెనీ వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ లో మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా 46 శాతం రిజిస్ట్రేషన్ వాటా కలిగి ఉండగా.. అది ఈ ఏప్రిల్ లో 39 శాతానికి పడిపోయింది.

అయితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం 39 నుంచి 45 శాతానికి రిజిస్ట్రేషన్లు పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇంటి రిజిస్ట్రేషన్ వేల్యూ 50 లక్షల లోపు ఉన్న ఇళ్ళు గత ఏడాదితో పోలిస్తే.. నాలుగు నెలల కాలంలో 4 శాతం తగ్గింది. 2023లో మొదటి నాలుగు నెలల్లో 16,060 ఇళ్ళ రిజిస్ట్రేషన్లు జరిగితే.. ఈసారి 15,419 ఇళ్ళ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అయినా కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్స్ లో రంగారెడ్డి జిల్లా మిగతా జిల్లాలతో పోలిస్తే టాప్ లో ఉంది. ఇక గత ఏడాదిలో 50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు 4,512 ఇళ్ళ రిజిస్ట్రేషన్లు జరిగితే.. ఈ ఏడాది 6,649 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 2024లో 47 శాతం పెరిగాయి.

తగ్గనున్న 1 BHK ఇళ్ల ధరలు:

ఇక గత ఏడాది కోటి పై విలువ చేసే ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2,060 యూనిట్లు కాగా.. ఈ ఏడాది 3,959కి పెరిగాయి. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయని కంపెనీ తెలిపింది. అయితే ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో ఎక్కువగా 2 బీహెచ్కే, 3 బీహెచ్కే ఇళ్లే కొంటున్నారు. 1 బీహెచ్ ఇళ్ళు కొనేవారు తక్కువగా ఉన్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఎక్కువ కాలం ఇళ్ళు అలానే ఖాళీగా ఉంటే నష్టం వస్తుంది కాబట్టి బిల్డర్లు తక్కువ ధరకు అమ్మే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి మధ్య తరగతి వ్యక్తులకు ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి