iDreamPost
android-app
ios-app

ఎయిర్ పోర్టు పక్కన తక్కువ ధరకే స్థలం.. ఇప్పుడు కొంటే ఐదేళ్ళలో 15 లక్షలు లాభం!

  • Published May 24, 2024 | 9:16 PM Updated Updated May 24, 2024 | 9:16 PM

Plots Near Airport: భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా మంది లాభపడ్డారు. తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతుందో చూసుకుని.. ఎక్కడ ల్యాండ్ మీద అప్రిసియేషన్ ఉంటుందో చూసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంచి లాభాలను పొందుతున్నారు. మీరు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంటే కనుక ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఈ ఏరియా మీకు ఫ్యూచర్ లో లాభాలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Plots Near Airport: భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా మంది లాభపడ్డారు. తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతుందో చూసుకుని.. ఎక్కడ ల్యాండ్ మీద అప్రిసియేషన్ ఉంటుందో చూసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంచి లాభాలను పొందుతున్నారు. మీరు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంటే కనుక ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఈ ఏరియా మీకు ఫ్యూచర్ లో లాభాలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్ పోర్టు పక్కన తక్కువ ధరకే స్థలం.. ఇప్పుడు కొంటే ఐదేళ్ళలో 15 లక్షలు లాభం!

బంగారం మీద గానీ, స్టాక్ మార్కెట్ లో గానీ, బిజినెస్ లో గానీ, ఇంకేదైనా దాంట్లో గానీ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో లేదో అన్న సందేహం. పైగా రిస్క్ ఎక్కువ. అయితే రిస్క్ అనేది లేకుండా పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు తెచ్చే వస్తువు ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. భూమిని బంగారంలా కొంటున్నారు. ఒకరకంగా బంగారం కంటే ఎక్కువ రేటు పెరిగిపోయింది. గడిచిన ఏళ్లలో బంగారం, వెండి, ఇతర లోహాలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్ మెంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటితో పోలిస్తే భూమి ధర వీటన్నిటికంటే ఎక్కువగా అంటే ఏకంగా 500 రెట్లు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో భూమి ధర అనేది ఆకాశాన్ని అంటుతోంది. సామాన్య మధ్యతరగతి వ్యక్తులకి ఇక్కడ భూమి కొనడం అనేది కష్టమైపోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ బాగుండి తక్కువ ధరకు భూమి దొరికే చోట పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

పెట్టుబడి పెట్టాలి అనుకుంటే వైజాగ్ లో కొన్ని ఏరియాలు ఉన్నాయి. వాటిలో భీమిలి ఒకటి. దీన్ని భీమునిపట్నం అని కూడా అంటారు. విశాఖపట్నంలో ప్రధాన టాప్ లొకాలిటీగా భీమిలి పట్టణం మారనుంది. విశాఖ జిల్లాలో తీర ప్రాంత పట్టణంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉండడంతో పాటు స్కూల్స్ కి, కాలేజీలకి, హాస్పిటల్స్ కి, బ్యాంకులకి, మాల్స్ కి, మార్కెట్స్ కి మంచి కనెక్టివిటీ కలిగి ఉంది. ఈ కారణంగా భీమిలి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మంచి ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు. విశాఖపట్నంకి దగ్గరగా, గీతం యూనివర్సిటీ నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. త్వరలో పూర్తికాబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 18 కి.మీ. దూరంలో ఉంది. కాబట్టి వైజాగ్ లో పెట్టుబడి పెట్టతగ్గ లొకేషన్ ఈ భీమిలి పట్టణం అని చెబుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం చదరపు అడుగు స్థలం సగటున రూ. 3,100 పలుకుతుంది. గజం సగటున రూ. 27,900 పలుకుతుంది.

2019లో చదరపు గజం రూ. 1450 ఉండగా.. 2024లో రూ. 3,100కి పెరిగింది. ఐదేళ్ళలో సగానికి పైగా పెరిగింది. అంటే 13 వేలు ఉన్న గజం విలువ ఇప్పుడు 28 వేలు అయ్యింది. గజం మీద 15 వేలు లాభం వచ్చినట్టు. వంద గజాల స్థలం కొన్నవారికి 15 లక్షలు లాభం వచ్చినట్టు. రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం ఐదేళ్లు ఆగాలని చెప్తున్నారు. అప్పుడే ల్యాండ్ విలువ అనేది పెరుగుతుందని, మంచి ధర వస్తుందని చెప్తున్నారు. పదేళ్లు ఆగితే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ వైజాగ్ లో ఉన్న భీమిలిలో ఇప్పుడు స్థలాలు కొంటే ఫ్యూచర్ లో మంచి లాభాలు వస్తాయని చెబుతున్నారు.  

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.