iDreamPost
android-app
ios-app

రతన్ టాటా మరణం పట్ల మాజీ ప్రేయసి ఎమోషనల్ పోస్టు.. ఇక నువ్వు లేవనే బాధ..

  • Published Oct 10, 2024 | 11:56 AM Updated Updated Oct 10, 2024 | 11:56 AM

Simi Garewal Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన బుధవారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణం పట్ల మాజీ ప్రేయసి ఓమోషనల్ పోస్టు చేశారు.

Simi Garewal Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన బుధవారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణం పట్ల మాజీ ప్రేయసి ఓమోషనల్ పోస్టు చేశారు.

రతన్ టాటా మరణం పట్ల మాజీ ప్రేయసి ఎమోషనల్ పోస్టు.. ఇక నువ్వు లేవనే బాధ..

బిజినెస్ కే పాఠాలు నేర్పిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా. వరల్డ్ వైడ్ గా రతన్ టాటా గురించి తెలియని వారుండరు. పారిశ్రామిక రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం రతన్ టాటా సొంతం. కోట్లాది మందికి రతన్ టాటా స్ఫూర్తి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల కొద్ది ఎంట్రాప్రెన్యూర్లకు ఆయన ఆదర్శం. టాటా కంపెనీ ఉన్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. వ్యాపారంలో తనకున్న నైపుణ్యంతో కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. టాటా ఉత్పత్తులపై ప్రజల్లో అంతటి విశ్వాసం కలగడానికి గల కారణం రతన్ టాటా. క్వాలిటీ ప్రొడక్ట్స్ ను తీసుకొస్తూ వ్యాపార సామ్రాజ్యంలో తిరుగు లేని శక్తిగా ఎదిగారు. బిజినెస్ లో తనకు తానే సాటిగా నిలిచారు.

తరగని సంపద ఉన్నా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. గొప్ప మానవతా మూర్తి. దేశంకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందించారు. కాగా ఇటీవల రతన్ టాటా అనారోగ్యానికి గురయ్యాడంటూ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వదంతులు వ్యాపించాయి. దీంతో వ్యాపార వర్గాలు, ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై రతన్ టాటా స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని సోషల్ మీడియా వేదికగా లెటర్ రిలీజ్ చేశారు. ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే రతన్ టాటా కన్నుమూశారు. 86ఏళ్ల రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

రతన్ మరణ వార్తతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి దేశానికి తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ సంతాపం తెలిపారు. ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా అని ఆమె ట్వీట్ చేశారు. రతన్ టాటాతో ఉన్న ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమి చెప్పారు. ఓ ఇంగ్లీష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత బాలీవుడ్, బెంగాలీలో పలు చిత్రాల్లో నటించారు. రతన్ టాటాకు ఓ లవ్ స్టోరీ ఉంది. ఆయన ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. వ్యాపారంలో విజయం సాధించిన ఆయన ప్రేమను సాధించుకోలేకపోయారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ప్రియురాలి జ్ఞాపకాలతోనే కాలం వెల్లదీశారు. ఎంతో మందకి ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా సూర్య చంద్రులు ఉన్నతంకాలం గుర్తుండిపోతారు.