iDreamPost
android-app
ios-app

బజాజ్ నుంచి ఇథనాల్ బైక్.. మీ డబ్బులు ఆదా అవడం పక్కా!

Bajaj Ethanol Bike: బజాజ్ నుంచి సరికొత్త ఇథనాల్ బైక్ రాబోతోంది. త్వరలోనే మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ బైక్ అందుబాటులోకి వస్తే పెట్రోల్ కష్టాలు తప్పి డబ్బులు ఆదా అవడం పక్కా అంటున్నారు నిపుణులు.

Bajaj Ethanol Bike: బజాజ్ నుంచి సరికొత్త ఇథనాల్ బైక్ రాబోతోంది. త్వరలోనే మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ బైక్ అందుబాటులోకి వస్తే పెట్రోల్ కష్టాలు తప్పి డబ్బులు ఆదా అవడం పక్కా అంటున్నారు నిపుణులు.

బజాజ్ నుంచి ఇథనాల్ బైక్.. మీ డబ్బులు ఆదా అవడం పక్కా!

బైక్ నడవాలంటే పెట్రోల్ ఉండాల్సిందే. పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు ఉసూరుమంటున్నారు. పెట్రోల్ కు ప్రత్యామ్నాయ మార్గాలవైపు ఆలోచిస్తూ సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపుతున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రికల్ బైకులు, స్కూటర్లు, కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక ఇటీవల బజాజ్ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సీఎన్జీతో నడిచే ఫ్రీడమ్ 125 బైక్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బజాజ్ నుంచి ఇథనాల్ తో నడిచే బైక్ రాబోతోంది. త్వరలోనే ఈ బైక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ బైక్ అందుబాటులోకి వస్తే మీ డబ్బులు ఆదా అవడం పక్కా అంటున్నారు నిపుణులు.

బజాజ్ కంపెనీ ఇథనాల్‌తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ బైక్‌లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది. బజాజ్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇథనాల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఇథనాల్‌తో నడిచే బైక్ అందుబాటులోకి వస్తే పెట్రోల్ కష్టాలు తప్పినట్టే అని ప్రజలు భావిస్తున్నారు. బజాజ్ నుంచి వచ్చే పల్సర్ బైక్ లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో బజాజ్ ఇథనాల్ బైక్ పల్సర్ నుంచే వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

బజాజ్ నుంచి రిలీజ్ అయిన ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. బడ్జెట్ ధరలో లభ్యమవుతుండడంతో డిమాండ్ పెరిగింది. ఈ బైక్ లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 కిలోల సీఎన్జీ ట్యాంక్‌లు ఫ్రీడం 125లో ఉన్నాయి. ఈ బైక్‌లో దాదాపు 330 కి.మీ. ప్రయాణించవచ్చు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. త్వరలోనే డెలివరీలు ప్రారంభంకానున్నట్టు కంపెనీ తెలిపింది. బజాజ్ నుంచి రానున్న ఇథనాల్ బైక్ పూర్తిగా ఇథనాల్ ఇంధనంతో నడుస్తుందని తెలుస్తోంది. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీని పొందొచ్చు. సీఎన్జీ బైక్ కంటే ఇథనాల్ బైక్ ధర తక్కువగానే ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.