iDreamPost
android-app
ios-app

PF అకౌంట్ ఉంటే ఎన్ని రకాల పెన్షన్స్ పొందొచ్చో తెలుసా? అర్హులు ఎవరంటే?

Employees Pension Scheme: పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్. మీకు పీఎఫ్ ఉంటే ఎన్ని రకాల పెన్షన్స్ ను అందుకోవచ్చో తెలుసా? ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95 కింద ఈపీఎఫ్ఓ పెన్షన్లు అందిస్తుంది. అవేంటంటే?

Employees Pension Scheme: పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్. మీకు పీఎఫ్ ఉంటే ఎన్ని రకాల పెన్షన్స్ ను అందుకోవచ్చో తెలుసా? ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95 కింద ఈపీఎఫ్ఓ పెన్షన్లు అందిస్తుంది. అవేంటంటే?

PF అకౌంట్ ఉంటే ఎన్ని రకాల పెన్షన్స్ పొందొచ్చో తెలుసా? అర్హులు ఎవరంటే?

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఆయా సంస్థలు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. ఈ మొత్తానికి కంపెనీ తరఫున కొంత యాడ్ చేస్తుంది. పీఎఫ్ ఖాతాలో జమైన సొమ్ముకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ అందిస్తుంది. అవసరానికి కొంత డబ్బును డ్రా చేసుకోవచ్చు. రిటైర్ మెంట్ తర్వాత పెన్షన్ సైతం వస్తుంది. ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసింది. మరి మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు 6 రకాల పెన్షన్స్ ను పొందొచ్చు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95 కింద ఈపీఎఫ్ఓ పెన్షన్లు అందిస్తుంది. అవేంటంటే?

సూపర్ యాన్యుయేషన్ పెన్షన్:

  • ఈ పెన్షన్ పొందేందుకు ఉద్యోగి 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారు లేదా 58 సంవత్సరాలు నిండిపోయి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ పెన్షన్ వస్తుంది.

ముందస్తు పెన్షన్:

  • 50 ఏళ్లు పైబడినవారు, పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు ఈ ముందస్తు పెన్షన్ పొందొచ్చు.

డిసేబుల్డ్ పెన్షన్:

  • తమ సర్వీసు కాలంలో తాత్కాలిక లేక శాశ్వత అంగవైకల్యం బారిన పడిన ఈపీఎఫ్ చందాదారులు ఈ పెన్షన్ కు అర్హులు. ఇందులో వయసు 50 లేదా 58 నిండి ఉండాల్సిన అవసరం లేదు. పదేళ్ల సర్వీసు కూడా అక్కర్లేదు.

చిల్డ్రన్ & వితంతు పెన్షన్:

  • పీఎఫ్ చందాదారుడు మరణిస్తే.. అతని భార్య లేదా భర్త, 25 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఈ పెన్షన్ అందుకోవచ్చు. ఇక్కడ కూడా సర్వీస్ కచ్చితంగా పదేళ్లు చేయాలన్నా నిబంధన లేదు.

అనాథ పెన్షన్:

  • పీఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి వారి జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినట్లయితే.. వారి ఇద్దరు పిల్లలకు ఆర్ఫాన్ పెన్షన్ ఇస్తారు. వయసు మాత్రం 25 ఏళ్ల లోపు ఉండాలి. వారికి 25 ఏళ్ల వయసు వరకు మాత్రమే పెన్షన్ వస్తుంది.

నామినీ పెన్షన్:

  • పీఎఫ్ అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత అతడి నామినీ ఈ పెన్షన్ పొందొచ్చు.