P Venkatesh
ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. యూట్యూబ్ ను టార్గెట్ చేస్తూ త్వరలో కొత్త టీవీయాప్ ను లాంఛ్ చేయనున్నట్లు తెలిపారు. యూట్యూబ్ కు త్వరలోనే షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. యూట్యూబ్ ను టార్గెట్ చేస్తూ త్వరలో కొత్త టీవీయాప్ ను లాంఛ్ చేయనున్నట్లు తెలిపారు. యూట్యూబ్ కు త్వరలోనే షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
P Venkatesh
ఎలాన్ మస్క్.. వరల్డ్ వైడ్ గా ఈ పేరు తెలియని వారుండరనే చెప్పాలి. సాహసోపేతమైన నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తూ తనకు తానే సాటిగా నిలుస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు, టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ ప్రయోగాలు ఇలా వినూత్న ఆలోచనలతో సరికొత్త హిస్టరీకి తెరలేపారు మస్క్. ప్రపంచ కుబేరుడిగా వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా రాణిస్తున్నారు ఎలాన్ మస్క్. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మస్క్. యూట్యూబ్ ను టార్గెట్ చేస్తూ కొత్త టీవీ యాప్ ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. యూట్యూబ్ కు ఎసరు పెట్టేందుకే.. దానికి పోటీగా టీవీ యాప్ ను ఎలాన్ మస్క్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా యూట్యాబ్ ఎంత పాపులారిటీ పొందిందో వేరే చెప్పక్కర్లేదు. యూట్యూబ్ ను కేవలం వినోదాన్ని పంచే సామాజిక మాధ్యమంగా గాక యూజర్లకు ఉపాధిని కూడా కల్పిస్తోంది. డిఫరెంట్ కంటెంటతో వీడియోలు రూపొందించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కన్ను యూట్యూబ్ పై పడింది. యూట్యూబ్ తరహాలోనే కొత్త టీవీ యాప్ ను వచ్చే వారం లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. మస్క్ దీనికి సంబంధించిన వివరాలను ఓ సోషల్ మీడియా యూజర్ కు ఇచ్చిన సమాధానంలో తెలిపాడు. అమెజాన్, శాంసంగ్ యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు చూసేందుకు వీలుగా టీవీ యాప్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ట్విట్టర్ కొనుగోలు తర్వాత కీలక మార్పులు చేశారు మస్క్. లోగోను మార్చడం, బ్లూ టిక్, సంస్థలో లేఆఫ్స్ వంటి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అదే విధంగా ఎక్స్ ను సామాజిక మాధ్యమంగానే కాకుండా సూపర్ యాప్ గా మార్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ నంబర్‌తో సంబంధం లేకుండా ఎక్స్ నుంచి నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకొనే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు త్వరలో ఎక్స్ మనీ ట్రాన్సిమీటర్ లైసెన్స్ పొందుతుందని చెప్పారు. దీని ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేకొనే వీలు కలుగనున్నట్లు తెలుస్తోంది.