Eblu: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఆటో కావాలా? అయితే దీనిపై లుక్కేయండి.

Eblu Electric Auto: చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని వినియోగదారుల కోసం అందుబాటు ధరలోనే ఈవీలని విడుదల చేస్తున్నాయి. తాజాగా గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను రిలీజ్ చేసింది.

Eblu Electric Auto: చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని వినియోగదారుల కోసం అందుబాటు ధరలోనే ఈవీలని విడుదల చేస్తున్నాయి. తాజాగా గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ మాములుగా లేదనే చెప్పాలి. దేశంలో చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు స్టార్ట్ అవుతున్నాయి. చాలా కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని తెస్తున్నాయి. వినియోగదారుల కోసం అందుబాటు ధరలోనే ఈవీలని విడుదల చేస్తున్నాయి. తాజాగా గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను మార్కెట్లో రిలీజ్ చేసింది. దీని పేరు గోదావరి ఇబ్లూ ఎలక్ట్రిక్ ఆటో. ఇక తాజాగా విడుదలయిన ఈ ఎలక్ట్రిక్ ఆటో చూడటానికి ఇతర ఆటో రిక్షాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఆటో వెడల్పు తక్కువగా ఉంటుంది. దీని పొడవు ఎక్కువగా ఉంటుంది. దీన్ని సరికొత్తగా డిజైన్ చేశారు. ఇది 2795 మిమీ పొడవు, 993 మిమీ వెడల్పు ఇంకా 1782 మిమీ ఎత్తుని కలిగి ఉంటుంది.

ఈ ఆటో ముందు, వెనుక చక్రాల మధ్య దూరం 2170 మిమీ ఉంటుంది. ఇంకా అంతే కాకుండా ఈ ఆటో 240 మిమీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ని కలిగి ఉండేలా డిజైన్ చేయబడింది. మంచి ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఎలాంటి కఠినమైన రోడ్లలో కూడా సులభంగా నడపవచ్చు. ఇది ఆటోమేటిక్ వైపర్లతో వస్తుంది.అయితే ఇందులో సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల ఫర్ఫామెన్స్‌ పరంగా కొంచెం ఈ ఆటో స్లోగా ప్రయాణిస్తుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు మాత్రమేనని గోదావరి కంపెనీ తెలిపింది.

ఇది 51.2 వోల్ట్స్‌, 100 యాంపియర్ లిథియం అయాన్‌ బ్యాటరీని కలిగి ఉంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 95 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. ఇంకా ఈ ఆటో 1.6kWh పవర్‌, 20 nm మాక్సిమం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీన్ని ఎక్కువ సీటింగ్ కెపాసిటీతో డిజైన్ చేశారు. ఇందులో సాధారణ ఆటోలో కంటే కూడా ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. డ్రైవర్ వెనుక, ప్రయాణీకులు సులభంగా కూర్చోవచ్చు. ఈ ఆటోలో డ్రైవర్ సీటు కూడా చాలా వెడల్పుగా ఉంటుంది. ఇంత సౌకర్యంగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను కేవలం రూ. 1,99,999 (ఎక్స్-షోరూమ్) ధరకే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇక తక్కువ ధరకే మంచి ఫీచర్లతో లాంచ్ అయిన ఈ గోదావరి ఇబ్లూ ఎలక్ట్రిక్ ఆటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Show comments