iDreamPost
android-app
ios-app

మహీంద్రా నుంచి అదిరిపోయే EV ట్రక్.. తక్కువ ధరలో 160KM రేంజ్!

  • Published Oct 07, 2024 | 4:58 PM Updated Updated Oct 07, 2024 | 5:44 PM

Mahindra: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్(ఎంఎల్ఎంఎంఎల్) మార్కెట్లో తన కొత్త కమర్షియల్ వెహికల్ ని విడుదల చేసింది. దీని పేరు మహీంద్రా Zeo.

Mahindra: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్(ఎంఎల్ఎంఎంఎల్) మార్కెట్లో తన కొత్త కమర్షియల్ వెహికల్ ని విడుదల చేసింది. దీని పేరు మహీంద్రా Zeo.

మహీంద్రా నుంచి అదిరిపోయే EV ట్రక్.. తక్కువ ధరలో 160KM రేంజ్!

ఈమధ్య కాలంలో చిన్న కమర్షియల్ వెహికల్స్(ఎస్సీవీ)కు డిమాండ్ మామూలుగా లేదనే చెప్పాలి. సిటీలల్లో వస్తువుల రవాణాలకు, వివిధ రకాల వస్తువులు డెలివరీ చేయడానికి, ముఖ్యంగా లాజిస్టిక్స్ పనులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిని నమ్ముకొని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. డ్రైవర్లకు ఇలాంటి ట్రక్ లు నిజంగా వరమనే చెప్పాలి. వారి జీవనోపాధికి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇక ఈ సెగ్మెంట్లో టాటా, మహీంద్రా కంపెనీలకు చెందిన వెహికల్స్ మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. తాజాగా మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్(ఎంఎల్ఎంఎంఎల్) మార్కెట్లో తన కొత్త స్మాల్ కమర్షియల్ వెహికల్ ని విడుదల చేసింది. దీని పేరు మహీంద్రా Zeo. ఇది చిన్న ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్. ఇది రెండు వేరియంట్‌లలో వస్తుంది. దీని ప్రైజ్ రూ. 7.52 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సబ్-2 టన్స్ సెగ్మెంట్ లో కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ గా మార్కెట్లోకి వచ్చింది. దీని పవర్ సూపర్ అనే చెప్పాలి. ఇది నార్మల్ డీజిల్ కమర్షియల్ వెహికల్ తో కంపార్ చేస్తే చాలా బెస్ట్. దీనిని వాడటం వలన ఏడేళ్లలో ఏకంగా రూ.7 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇది హై వోల్టేజ్ 300+ V ఆర్కిటెక్చర్ ద్వారా పవర్ ని పొందుతుంది. దీని వల్ల వెహికల్ స్ట్రెంత్, ​రేంజ్, ఛార్జింగ్ స్పీడ్ పెరుగుతాయి. దీని అప్డేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 30 కిలో వాట్స్ పవర్, 114Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 21.3 kwh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ పర్ఫార్మన్స్ ఇస్తుంది. ఈ ట్రక్ గంటకు 60 కిలోమీటర్ల మాక్సిమం స్పీడ్, 765 కిలోల వరకు పేలోడ్ స్ట్రెంత్ ని ఇస్తుంది. ఎన్నో రకాల వ్యాపార అవసరాలకు అనుగుణంగా దీన్ని డిజైన్ చేశారు. దీనిలో 2,250 mm కార్గో బాక్స్‌ ఉంటుంది. దీని రేంజ్ విషయానికి వస్తే సూపర్ అనే పదం సరిపోదు. ఎందుకంటే ఇందులో రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఉంటుంది. దీని ద్వారా 160 కిలోమీటర్ల వరకు రియల్ టైం-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ పొందవచ్చు. దీనికి డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. దీనితో కేవలం 60 నిమిషాల్లో 100 కి.మీ రేంజ్ దాకా ప్రయాణించవచ్చు. ఇందులో 3.3 kw ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో సహా చాలా చార్జింగ్ కాన్ఫిగరేషన్‌లు ఉంటాయి.

దీని ఫీచర్లు గురించి తెలిస్తే కచ్చితంగా వావ్ అంటారు. ఇందులో ఉండే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, క్రీప్ ఫంక్షన్ ఫీచర్లు డ్రైవర్ కి చాలా కంఫర్ట్ అందిస్తాయి. డ్రైవర్ అలసటను తగ్గిస్తాయి. ఇరుకుగా ఉండే రోడ్ల పైన కూడా చాలా ఈజీగా వెళ్ళవచ్చు . దీని లోపల, క్యాబిన్ డాష్‌బోర్డ్-మౌంటెడ్ ట్రాన్స్‌మిషన్ డయల్, టైప్-సి యూఎస్బీ ఛార్జింగ్ స్లాట్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి సూపర్ ఫీచర్‌లు ఉంటాయి. ఈ వెహికల్ లో నెమో(NEMO) టెలిమాటిక్స్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ ఫీచర్ తో ఫ్లీట్ మేనేజర్‌లు, పర్సనల్ డ్రైవర్‌ల రియల్ టైమ్ డేటాను యాక్సెస్ చేయవచ్చు.ఈ వెహికల్ కి ఏడు సంవత్సరాల లేదా 1.5 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని ఇస్తారు. అదనంగా, మహీంద్రా సఫర్, సఫర్ ప్లస్ ప్లాన్‌ల కింద రెండు సర్వీస్ ప్యాకేజీలను కూడా ఇస్తారు. ఇందులో రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీస్, ఎక్స్ టెండెడ్ వారంటీ ఆప్షన్స్ ఉన్నాయి.ఇలాంటి కమర్షియల్ వెహికల్స్ కి సేఫ్టీ అనేది చాలా ఇంపోర్టెట్. కానీ పెద్దగా సేఫ్టీ ఫీచర్లు వీటికి ఉండవు. కానీ ఈ వెహికల్ లో ఉంటాయి. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఇందులో ఉంటుంది. ఈ వెహికల్ ఏఐ-ఎనేబుల్డ్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఇందులో లేన్ డిపార్చర్ వార్నింగ్స్, పాదచారులకు ప్రమాదం కలిగించే వార్నింగ్స్ ఉంటాయి. అలాగే ఈ కారులో డ్రైవర్ బిహేవియర్ ని యనాలసిస్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్‌ ఫీచర్, మోటార్ వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ67 కూడా ఉంటుంది. ఇలాంటి లగ్జరీ ఫీచర్లు మీకు ఏ కమర్షియల్ ట్రక్ లో కనిపించవు. కానీ దీంట్లో ఇవన్నీ వస్తాయి. ఇక ఈ సరికొత్త మహీంద్రా జియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.