iDreamPost
android-app
ios-app

మారుతి నుంచి కొత్త Swift లిమిటెడ్ ఎడిషన్.. 50 వేల బెనిఫిట్స్!

  • Published Oct 17, 2024 | 12:29 PM Updated Updated Oct 17, 2024 | 12:29 PM

Maruthi Swift: మారుతి స్విఫ్ట్ తాజాగా కొత్త ఎడిషన్ ని లాంచ్ అయింది. ఈ ఎడిషన్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే మనం మంచి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Maruthi Swift: మారుతి స్విఫ్ట్ తాజాగా కొత్త ఎడిషన్ ని లాంచ్ అయింది. ఈ ఎడిషన్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే మనం మంచి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

మారుతి నుంచి కొత్త Swift లిమిటెడ్ ఎడిషన్.. 50 వేల బెనిఫిట్స్!

మారుతి సుజుకి కార్లకు ఇండియన్ మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటాయి. పైగా సర్విస్ విషయంలో మారుతి సూపర్ అనే చెప్పాలి. దేశంలో ఎక్కడ చూసిన మారుతి సర్విస్ సెంటర్లకు ఢోకా లేదనే చెప్పాలి. అయితే తన కార్ల అమ్మకాలను పెంచుకోవడంలో మారుతి కస్టమర్లని ఎప్పటికప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. కస్టమర్లకు ఎన్నో రకాల బెనిఫిట్స్ అందిస్తుంది. మారుతి తన బెస్ట్ సెల్లింగ్ కార్ల కోసం స్పెషల్ యాక్సెసరీస్ ప్యాక్‌లను తీసుకువస్తోంది. అందువల్ల మార్కెట్లో వాటి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ విధంగా ఇంతకుముందు బలెనో రీగల్ ఎడిషన్, మారుతి వ్యాగన్ఆర్ వాల్ట్జ్ ఎడిషన్, మారుతి బ్రెజ్జా అర్బనో ఎడిషన్‌లను మారుతి రిలీజ్ చేసింది. అయితే తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కార్ అయిన స్విఫ్ట్ ని కూడా కొత్త ఎడిషన్ లో లాంచ్ చేసింది. ఈ ఎడిషన్ పేరు మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ (Maruthi Swift Blitz). ఇదొక లిమిటెడ్ ఎడిషన్. ఇందులో స్పెషల్ ఏంటంటే .. ఇందులో స్పెషల్ యాక్సెసరీస్ ప్యాక్‌ ఉంటుంది. ఇక ఈ ఎడిషన్ లో ఎలాంటి ఫీచర్లు వస్తాయి? ఇందులో ఉండే స్పెషల్ యాక్సెసరీస్ ఏంటి? దీని ధర ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక ఈ సరికొత్త మారుతి స్విఫ్ట్ blitz ఎడిషన్ విషయానికి వస్తే.. ఇది మొత్తం 5 వేరియంట్‌లలో వస్తుంది. ఇందులో LXI, VXI, VXI AMT, VXI(O), VXI(O) AMT వేరియంట్లు ఉన్నాయి. ఈ వేరియంట్‌ల ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కార్లో మనకు “Rear Underbody Spoiler, Fog Lamp, Illuminated Door Sill Guards, Door Visors, Side Body Mouldings, Rear Upper Spoiler” వంటి యాక్సెసరీస్ వస్తాయి. ఆకట్టుకునే అంశం ఏమిటంటే దాదాపు 50 వేలు విలువ చేసే ఈ యాక్సెసరీస్ కిట్‌ను మారుతీ తన కస్టమర్లకు ఫ్రీగానే ఇస్తుంది. ఇక ఈ మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ధర విషయానికి వస్తే రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల దాకా ఉంటుంది. వేరియంట్ ని బట్టి ఈ కార్ ధర మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మేలో మార్కెట్లోకి వచ్చిన స్విఫ్ట్‌కు కంపెనీ CNG వేరియంట్‌ను యాడ్ చేసింది. ఇక ఈ కార్ లో 1.2-లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది.ఇది పెట్రోల్‌పై 82hp, 112Nm, CNGపై 70hp, 112Nm పవర్ ని జనరేట్ చేస్తుంది. పెట్రోల్‌ వెర్షన్ లో దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. ఎక్స్ట్రా గా 5 స్పీడ్ ఆటోమాటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ బేస్ వేరియంట్ లో రాదు. బేస్ వేరియంట్ తప్ప మిగతా అన్నింటిలో ఈ ఆప్షన్ ఉంది.

స్విఫ్ట్ బ్లిట్జ్ అనేది ఈ సెగ్మెంట్లో ఫిఫ్త్ స్పెషల్ ఎడిషన్. దీనిలోని అన్నీ వేరియంట్లకు కూడా హిల్ హోల్డ్ కంట్రోల్, ESP, కొత్త సస్పెన్షన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్ (BA) వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఇక ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 24.80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఆటోమ్యాటిక్ వేరియంట్ అయితే 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక CNG వేరియంట్ అయితే 32.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది సంగతి.. ఇక తాజాగా లాంచ్ అయిన ఈ మారుతి SWIFT BLITZ లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.