iDreamPost
android-app
ios-app

iVOOMi S1 Lite: మార్కెట్లోకి కొత్త స్కూటర్.. దీని మైలేజ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

  • Published Oct 03, 2024 | 6:55 PM Updated Updated Oct 03, 2024 | 6:55 PM

iVOOMi S1 Lite: అందుబాటు ధరలోనే సరికొత్త ఈవీ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. ఇవూమీ.. ఎస్1 లైట్‌ పేరుతో సరికొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.

iVOOMi S1 Lite: అందుబాటు ధరలోనే సరికొత్త ఈవీ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. ఇవూమీ.. ఎస్1 లైట్‌ పేరుతో సరికొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.

iVOOMi S1 Lite: మార్కెట్లోకి కొత్త స్కూటర్.. దీని మైలేజ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇండియాలో కూడా ఈవీ స్కూటర్ల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రజలకు అందుబాటు ధరలోనే సరికొత్త ఈవీ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా పూణేకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఇవూమీ.. ఎస్1 లైట్‌ పేరుతో సరికొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ. 84,999(ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్లలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. పైగా ఈ స్కూటర్ కొన్నవారికి కంపెనీ బంపర్ ఆఫర్ కూడా ఇస్తుంది. దీనిపై ఏకంగా మూడు సంవత్సరాల బ్యాటరీ వారెంటీని కంపెనీ అందిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ని లాంచ్ చేశారు. ఇప్పటికే డీలర్‌షిప్‌లలో ఈ స్కూటర్ బుకింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. ఇక సరికొత్తగా లాంచ్ అయిన ఈ ఇవూమి ఎస్1 లైట్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఇవూమీ ఎస్ 1 లైట్ స్కూటర్ బ్యాటరీ అయితే అదుర్స్ అని చెప్పాలి. ఇది 60 వీ 52 ఏహెచ్ లయన్ బ్యాటరీ. ఇది చాలా పవర్ ఫుల్ బ్యాటరీ. అందుకే దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిమీల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సూపర్ స్కూటర్ 1.2 కేడబల్ల్యూ పవర్, 10.1 ఎన్ఎం మాక్సిమం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే.. ఇవూమీ ఎస్1 లైట్ స్కూటర్ మాక్సిమం స్పీడ్ గంటకు 53 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు ఉంటాయి. వెనుక భాగంలో స్ప్రింగ్ కాయిల్ యూనిట్ ఉంటుంది. ఇది వాహనాదారులకు బాగా నచ్చుతుంది. దీనికి ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేకింగ్ సెటప్ అనేది ఉంటుంది.

ఇవూమీ ఎస్1 లైట్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి 4 గంటల టైమ్ పడుతుంది. ఈ స్కూటర్లో ఇంకో ఆకట్టుకునే అంశం ఏంటంటే.. ఇది ఏకంగా 18 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది 150 కిలోల వరకు మోసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ఎల్ఈడీ డిస్ప్లే చాలా బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఎల్ఈడీ డిస్‌ప్లే కావాలంటే ఎక్స్ట్రా రూ. 4,999 చెల్లించి పొందాలి. ఇంకా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో డీటీఈ ఇండికేటర్, టర్న్-బై- టర్న్ నావిగేషన్‌తో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఎస్ఎంఎస్/కాల్ అలర్ట్లు వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయడానికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌ కూడా ఈ స్కూటర్లో ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇక సరికొత్తగా లాంచ్ అయిన ఈ ఇవూమి ఎస్1 లైట్ స్కూటర్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.