iDreamPost
android-app
ios-app

EMIలు ఎక్కువైపోయాయా? ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అన్నీ ఈజిగా తీరిపోతాయి..!

  • Published Oct 28, 2024 | 2:22 PM Updated Updated Oct 28, 2024 | 2:22 PM

EMI: చాలా మందికి కూడా చాలా EMI లు ఉంటాయి. వాటిని కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

EMI: చాలా మందికి కూడా చాలా EMI లు ఉంటాయి. వాటిని కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

EMIలు ఎక్కువైపోయాయా? ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అన్నీ ఈజిగా తీరిపోతాయి..!

చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ ని ఎంతగానో ఇబ్బంది పెట్టే సమస్య EMI. చాలా మందికి కూడా ఏదోక EMI అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఒకటి, రెండు EMI లు అయితే మ్యానేజ్ చేయవచ్చు. కొంతమందికి చాలా EMI లు ఉంటాయి. తమ సంపాదనకు మించి ఎక్కువ EMI లు కడుతూ ఉంటారు చాలా మంది. అవి తీర్చడానికి నానా తంటాలు పడుతుంటారు. రికవరీ ఏజెంట్ల టార్చర్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు చెప్పే టిప్ అప్లై చేస్తే మీకు ఉన్న EMI లన్నీ చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక ఆ టిప్ ఏంటి? దానితో EMI లన్నీ ఎలా క్లియర్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎక్కువ EMI లు తీర్చడానికి డెబ్ట్ కన్సాలిడేషన్ లోన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఈ లోన్ తో అనేక రకాల అప్పుల నుంచి సింపుల్ గా రిలీఫ్ పొందవచ్చు. ఎలాగంటే.. మీకు రకరకాల చిన్న చిన్న అప్పులు ఉన్నాయనుకుందాం. వాటికి ఎక్కువ వడ్డీలు చెల్లిస్తున్నారు అనుకుందాం. అప్పుడు వాటన్నిటినీ ఒకేసారి క్లియర్ చేసేందుకు ఒక పెద్ద లోన్ తీసుకోవటాన్ని డెబ్ట్ కన్సాలిడేషన్ లోన్ అని అంటారు. ఈ లోన్ ఎక్కువ లోన్లు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనికి అప్లై చేస్తే ఎక్కువ లోన్ పొందవచ్చు. పైగా ఈ లోన్ పై మనం కట్టే వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. అలాగే లోన్ టెన్యూర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అన్నీ లోన్లు కట్టాలంటే వడ్డీ ఎక్కువ అవుతుంది. అందువల్ల మనకు మోయలేని భారం పడుతుంది. కానీ తక్కువ వడ్డీతో ఈ లోన్ తీసుకున్నామంటే అన్నీ లోన్లు క్లియర్ అవుతాయి.

ఈ డెబ్ట్ కన్సాలిడేషన్ లోన్లని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి సెక్యూరిటీతో అయితే, మరోటి సెక్యూరిటీ లేకుండా తీసుకోవచ్చు. ఇది ఆయా బ్యాంకు, ఆర్థిక సంస్థ, వినియోగదారుని క్రెడిట్ హిస్టరీని బట్టి ఉంటుంది. అయితే ఈ లోన్ తీసుకునేటప్పుడు కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కండిషన్స్ జాగ్రత్తగా తెలుసుకొని ఈ లోన్ తీసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. ఈ లోన్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కొన్ని లిమిట్స్ ఉంటాయి. తక్కువ వడ్డీతో లోన్ వచ్చినా కానీ… అప్పు తిరిగి చెల్లించే టెన్యూర్ ఎక్కువగా ఉండడం వల్ల మొత్తంగా చెల్లించే డబ్బు ఎక్కువ అవుతుంది. అలాగే నెలనెల ఈఎంఐ క్రమం తప్పకుండా కట్టాల్సి ఉంటుంది. లేదంటే మీకు ఫైన్ లు ఎక్కువ పడతాయి. వరుసగా మూడు నెలలు (90 రోజులు) ఒక్క ఈఎంఐ కూడా కట్టకపోతే బ్యాంకు మిమ్మల్ని డిఫాల్టర్ గా ప్రకటిస్తుంది. దాని వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. మీ క్రెడిట్ హిస్టరీ దెబ్బతినడమే కాకుండా… ఫ్యూచర్ లో తీసుకునే లోన్ల పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టే పరిస్థితి ఉంటే మాత్రమే ఈ లోన్ కి అప్లై చెయ్యండి. ఇక ఈ లోన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.