iDreamPost
android-app
ios-app

East Hyderabad: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్‌గా ఈస్ట్ హైదరాబాద్!

  • Published Aug 14, 2024 | 4:46 PM Updated Updated Aug 14, 2024 | 4:46 PM

Land Rates In This Area Will Grow: రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని అనుకుంటున్నారా? అయితే మరి ఎక్కువ మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?

Land Rates In This Area Will Grow: రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని అనుకుంటున్నారా? అయితే మరి ఎక్కువ మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?

East Hyderabad: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్‌గా ఈస్ట్ హైదరాబాద్!

హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారు ముందుగా ఆలోచించేది ఏ దిక్కున కొనాలి అనే. వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ ఇలా జోన్ల వారీగా హైదరాబాద్ నగరం డెవలప్ అవుతూ వస్తుంది. వీటిలో బాగా డెవలప్ అయిన జోన్ అంటే అది వెస్ట్ హైదరాబాదే. గచ్చిబౌలి, మూసాపేట, పటాన్ చేరు, కూకట్ పల్లి వంటి ఏరియాలు వెస్ట్ హైదరాబాద్ కిందకి వస్తాయి. ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కాప్రా, పోచారం, ఎల్బీనగర్, కొత్తపేట వంటి ప్రాంతాలు ఈస్ట్ హైదరాబాద్ కిందకి వస్తాయి. అయితే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని భావించేవారు ముఖ్యంగా చూసేది ఐటీ కారిడార్ వైపే. ఎందుకంటే అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. దీంతో నివాస స్థలాలకి, నివాస గృహాలకి డిమాండ్ ఏర్పడుతుంది.

కొనేవారు అయినా, ఇన్వెస్ట్ చేసేవారు అయినా ఐటీ కారిడార్ ప్రాంతం ఎటువైపు ఉంటే అక్కడే ఆసక్తి చూపిస్తారు. అయితే ఐటీ కారిడార్ లేకపోయినప్పటికీ ఇప్పుడు అందరి ఆసక్తి ఈస్ట్ హైదరాబాద్ వైపే ఉంది. ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్న పోచారం ఇప్పుడు బెస్ట్ రియల్ ఎస్టేట్ హబ్ గా ఉంది. ఇన్ఫోసిస్ క్యాంపస్ పోచారంలో ఉంది. అలానే అక్కడ పలు కంపెనీలు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఉంది. ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్, నాచారం, ఎల్బీనగర్ వంటి ఏరియాల్లో ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రవాణా సదుపాయాలతో ఈ ప్రాంతాలు బాగా డెవలప్ అయ్యాయి. నాగోల్, ఎల్బీనగర్ వరకూ మెట్రో రైలు అందుబాటులో ఉంది.

ఉప్పల్ దగ్గర భగాయత్ లేఅవుట్, మెట్రో డిపో వద్ద కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మాణంలో ఉన్నాయి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో (ఎస్ఆర్డీపీ) భాగంగా నిర్మించిన ఫ్లైఓవర్ల కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గింది. మెట్రో ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ వైపునకు విస్తరించనుంది. వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాలతో పోలిస్తే ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో తక్కువ ధరకే ప్రాపర్టీలు దొరుకుతుండడంతో ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈస్ట్ హైదరాబాద్ లో భూములు అందుబాటులో ఉండడంతో ఐటీ కంపెనీలను, పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈస్ట్ హైదరాబాద్ లో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు, ఇల్లు అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతాన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరి చూపు ఈ ప్రాంతం వైపే ఉంది. పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరిగిపోయింది. డిమాండ్ పెరిగితే ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పెరిగే లోపు కొనేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.