Keerthi
తాజాగా పోస్టాఫీస్ లో పదేళ్ల కంటే తక్కువ సమయంలోనే డబ్బుల్ని రెట్టింపు చేసే ఆద్భుతమైన స్కీమ్ అనేది అందుబాటులోకి వచ్చింది. మరి, ఆ స్కీమ్ వివరాలు గురించి తెలుసుకుందాం.
తాజాగా పోస్టాఫీస్ లో పదేళ్ల కంటే తక్కువ సమయంలోనే డబ్బుల్ని రెట్టింపు చేసే ఆద్భుతమైన స్కీమ్ అనేది అందుబాటులోకి వచ్చింది. మరి, ఆ స్కీమ్ వివరాలు గురించి తెలుసుకుందాం.
Keerthi
ప్రస్తుత కాలంలో చాలామంది సంపాదిస్తున్న ఆదాయాన్ని మొత్తం సేవింగ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు రకరకాల పెట్టుబడి సాధనాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా.. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి అన్ని రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే.. వాటిలో పెట్టుబడి పెడితే కోల్పేయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఎంతోమంది ఎటువంటి రిస్క్ లేకుండా.. గ్యారెంటీ రిటర్న్స్ వచ్చేలా పోస్టాఫీస్ లో పెట్టబడులను పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే.. దీనిలో కేంద్ర హామీ కూడా ఉంటుంది. ఇది చాలా సురక్షితమైనది. మరి అలాంటి వారి కోసం పోస్టాఫీస్ లో తాజాగా ఇప్పుడు 115 నెలల్లో అంటే పదేళ్ల కంటే తక్కువ సమయంలోనే డబ్బుల్ని రెట్టింపు చేసే ఆద్భుతమైన స్కీమ్ అనేది అందుబాటులోకి వచ్చింది. మరి, ఆ స్కీమ్ వివరాలు గురించి తెలుసుకుందాం.
చాలామంది సంపాదిస్తున్న ఆదాయాన్ని సేవింగ్స్ రూపంలో స్టాక్ మార్కెట్లో పొదుపు చేసి రిస్క్ చేయడంకన్నా.. పోస్టాఫీస్ స్కీమ్ లో పొదుపు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే.. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి పొందవచ్చని ఎక్కువ మంది ఈ పోస్టాఫీస్ లోనే పెట్టుబడులను పెడుతుంటారు. ఈ క్రమంలోనే.. ఈ పోస్టాఫీస్ లో ఇప్పటికే రకరకాల స్కీమ్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు పోస్టాఫీస్ పథకాల్లో మీ డబ్బుల్ని కొంతకాలంలోనే డబుల్ చేసే ఆద్భుతమైన స్కీమ్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఆ స్కీమ్ పేరే.. కిసాన్ వికాస్ పత్ర. ప్రస్తుతం ఈ కిసాన్ వికాస్ పత్ర పథకంలో.. 7.5 శాతం చొప్పున వడ్డీ రేటు ఉంది. అంటే వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కించడంతో పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వర్తిస్తుంది. అయితే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. ఈ పథకంలో సరిగ్గా 9 సంవత్సరాల 7 నెలలు కానీ మొత్తం 115 నెలల్లో కానీ, మీ పెట్టుబడి మొత్తం డబుల్ అవుతుంది. పైగా దీనిలో కేంద్రం వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంది. అంటే ఒక్కోసారి పెరగవచ్చు, తగొచ్చు, స్థిరంగా అయిన ఉండవచ్చు.
ఇక మీరు పెట్టే పెట్టుబడి డబుల్ అవ్వడమంటే.. ఉదాహరణకు రూ. 50 వేలు మీరు కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. అది 115 నెలల్లో కాస్త రూ. లక్షగా మారుతుంది. దీనిబట్టి మరో రూ. 50 వేలు లాభం పొందవచ్చు. అలాగే రూ. 5 లక్షలు పెడితే.. అది సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ చొప్పున అంటే.. 9 సంవత్సరాల 7 నెలల్లో మీ డబ్బులు రూ .10 లక్షలు అవుతాయి. దీనిని పోస్టాఫీస్, బ్యాంకులకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే సింగిల్ అడల్ట్, జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. పైగా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి కూడా అకౌంట్ తెరవొచ్చు. అయితే ఈ స్కీంలో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. అనగా కావాల్సినంత డబ్బులు పెట్టుబడి పెట్టుకోవచ్చు.కాగా, గతేడాది ఏప్రిల్ సమయంలో దీని వడ్డీ రేటు 7.20 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగింది.
అంతకుముందు ఈ స్కీంలో డబ్బులు రెట్టింపు అయ్యేందుకు 120 నెలలు పట్టేది. కానీ, అది ఇప్పుడు 115 నెలలకే వస్తుంది. ఈ స్కీం కింద నామినీని మాత్రం యాడ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అయితే ఈ అకౌంట్ అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో.. టెన్యూర్ కంటే ముందుగానే క్లోజ్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్ హోల్డర్ , జాయింట్ అకౌంట్ కింద ఒకరు లేదా అంతా చనిపోయిన సందర్భాల్లో కూడా వర్తిస్తుంది, అయితే ఇది డిపాజిట్ ప్రారంభించిన రెండున్నరేళ్ల తర్వాత కూడా అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. మరి, పోస్టాఫీస్ లో కిసాన్ వికాస్ పత్ర పథకం కింద పెట్టుబడని రెట్టింపు చేసే ఆద్భుతమైన స్కీమ్ అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.