iDreamPost
android-app
ios-app

కొత్తగా AC కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Mistakes To Avoid While Buying Air Conditioner: ఎండలు ముదిరిపోయాయని కొత్తగా ఏసీ కొంటున్నారా? అయితే ఇలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి.

Mistakes To Avoid While Buying Air Conditioner: ఎండలు ముదిరిపోయాయని కొత్తగా ఏసీ కొంటున్నారా? అయితే ఇలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి.

కొత్తగా AC కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

మండే ఎండాకాలం రానే వచ్చింది. అందరూ భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలు వస్తున్నాయి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అందరూ ఏసీలకు పని చెప్తున్నారు. అయితే ఇన్నాళ్లు కూలర్లతో సరిపెట్టుకున్న ఎంతో మంది ఈసారి ఏసీలు కొనాలి అని ఫిక్స్ అవుతున్నారు. ఏసీల అమ్మకాలు కూడా గణనీయంగా పెరగబోతున్నాయి అంటూ మార్కెట్ నిపుణులు అంచనాలు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీలు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఏసీ కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా ఏసీని ఎంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. మీ గది పరిమాణానికి తగిన ఏసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే మీకు 1 టన్ ఏసీ కావాలా? 1.5 టన్ ఏసీ కావాలా? 2 టన్నుల ఏసీ కొనుగోలా చేయాలా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు మీ గది 110 చదరపు అడుగులు ఉంటుంది అనుకుంటే 1 టన్ ఏసీ సరిపోతుంది. అదే గనుక 110 నుంచి 160 చదరపు అడుగుల మధ్య ఉంటే మాత్రం కచ్చితంగా 1.5 టన్ తీసుకోవాలి. 160కి మించి ఉంటే మాత్రం 2 టన్ ఏసీని కొనుగోలు చేయాలి. ఇలా గది పరిమాణానికి తగిన ఏసీని తీసుకోకపోతే విద్యుత్ బిల్లు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది.

అలాగే ఏసీ కొనుగోలు సమయంలో స్టార్ రేటింగ్ చాలా ముఖ్యంగా 3 స్టార్ ఏసీకీ 4 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకీ ధరల్లో చాలా తేడా ఉంటుంది. 3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి ధరలో 5 నుంచి 10 వేల వరకు తేడా రావచ్చు. ధర ఎక్కువ ఉందని తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కొంటే ఆ తర్వాత ఏసీ ఉన్నంతకాలం అధిక విద్యుత్ బిల్లు కట్టాల్సి వస్తుంది. కాబట్టి స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న ఏసీని కొంటే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే ఇప్పుడు ఇన్ బిల్ట్ ఇన్వర్టర్ ఏసీలు వస్తున్నాయి. ఇన్వర్టర్ ఉండటం వల్ల ఫ్యాన్ స్పీడ్, గది ఉష్ణోగ్రత బట్టి ఏసీని రన్ చేస్తుంది. ఇన్వర్టర్ లేని ఏసీ వల్ల ఇలాంటి సౌలభ్యం ఉండదు. అలాంటప్పుడు ఏసీ వినియోగం పెరిగి విద్యుత్ బిల్ పెరుగుతుంది.

Dont do this mistakes when you are buying AC

అలాగే కన్వర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వాటినే కొనుగోలు చేయడం వల్ల లాభం ఉంటుంది. అంటే మీరు 1.5 టన్ కన్వర్టబుల్ ఏసీని కొనుగోలు చేస్తే.. దానిని మీ అవసరాన్ని బట్టి 1 టన్ గా.. కావాలంటే 0.8 టన్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే మీరు స్టెబిలైజర్ ని కూడా కొనుగోలు చేయడం మర్చిపోవద్దు. సిటీలు అయినా కూడా పవర్ ప్లక్చువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏసీకి స్టెబిలైజర్ ఉండాలి. దానివల్ల ఏసీ పాడవ్వకుండా ఉంటుంది. అలాగే మీరు ఇప్పటికే ఏసీ వాడుతుంటే మాత్రం కచ్చితంగా టైమ్ కి సర్వీసింగ్ చేయించుకోండి. దానివల్ల ఏసీ పనితనం పెరుగుతుంది. విద్యుత్ వాడకం తగ్గుతుంది. మరి.. ఏసీ కొనుగోలు చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటారుగా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.