iDreamPost
android-app
ios-app

మీ లోన్ EMI లేటుగా కడుతున్నారా? ఇక ఒక్కరోజు లేటైనా భారీ నష్టాలే!

  • Published Nov 16, 2024 | 11:30 AM Updated Updated Nov 16, 2024 | 11:30 AM

EMI: చాలా మంది కూడా కొన్ని కారణాల వలన లోన్ ఈ‌ఎం‌ఐలు లేట్ గా కడుతూ ఉంటారు. అయితే దాని వల్ల కచ్చితంగా భారీ నష్టాలు తప్పవు..

EMI: చాలా మంది కూడా కొన్ని కారణాల వలన లోన్ ఈ‌ఎం‌ఐలు లేట్ గా కడుతూ ఉంటారు. అయితే దాని వల్ల కచ్చితంగా భారీ నష్టాలు తప్పవు..

మీ లోన్ EMI లేటుగా కడుతున్నారా? ఇక ఒక్కరోజు లేటైనా భారీ నష్టాలే!

ప్రస్తుతం లోన్లు తీసుకొని EMI లు కడుతున్న వారు ఓ రేంజిలో పెరిగిపోయారు. క్రెడిట్ కార్డుల వాడకం కూడా విపరీతంగా పెరిగింది. దీంతో ఈఎంఐ అంటే ప్రతి ఒక్కరికీ కూడా సాధారణ ఇంటి ఖర్చు లాగా మిగిలిపోయింది. అయితే మనకు ఉన్న గడువులోపు ఈఎంఐ కట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి అదనపు భారం ఉండదు. కానీ, ఈఎంఐ కట్టడం కనుక ఆలస్యమైతే ఛార్జీలు ఉంటాయి. చాలా మంది కూడా లోన్ ఈఎంఐ చెల్లించే రోజు నాటికి అకౌంట్ లో సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోరు. ఈఎంఐ డిడక్ట్ కాలేదని బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చే దాకా తేరుకోలేరు. అప్పుడు డబ్బులు కట్టేందుకు నానా హడావుడి పడుతుంటారు. వాళ్ళని వీళ్ళని అడిగి అప్పు చేసి ఆలస్యానికి పెనాల్టీతో సహా కట్టేస్తారు . అయితే ఇక నుంచి లోన్ ఈఎంఐ గడువు దాటి ఒక్క రోజు అయినా కూడా కష్టాలు తప్పవు. మీరు ఊహించని దాని కంటే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది.

ఇక EMI లేట్ అయితే మీరు చాలా సంవత్సరాలు జాగ్రత్తగా పేమెంట్లు చేసుకుంటూ మెంటేన్ చేస్తున్న క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్క రోజు ఈఎంఐ లేట్ అయితే క్రెడిట్ స్కోరు ఏమి అరిగిపోదులే అనుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇక లోన్ EMI కట్టడం ఆలస్యం అయితే అది క్రెడిట్ స్కోరును దారుణంగా దెబ్బతీస్తుంది. అది ఒకరోజైనా సరే తగ్గడం పక్కా. రీసెంట్ గా ఓ వ్యక్తి హోమ్ లోన్, దానిపై టాపప్ లోన్ తీసుకుని ఒకరోజు లేటుగా ఈఎంఐ కట్టడటా. అందువల్ల అతని సిబిల్ స్కోర్ 27 పాయింట్లు తగ్గిందట. ఆగస్టు, 2024లో అతని సిబిల్ స్కోర్ 799గా ఉండగా అది సెప్టెంబర్ 2024 నాటికి 772కు పడిపోయిందట. ఆ తర్వాత నెల అక్టోబర్‌లో సరైన సమయంలోపే ఈఎంఐ కట్టినా కూడా సిబిల్ స్కోరు పెరగలేదని తెలిసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కసారి తప్పు జరిగినా కూడా అది భారీ మూల్యం చెల్లించుకునేందుకు దారి తీస్తుంది.

ఇక క్రెడిట్ స్కోర్ ఒక్క పాయింట్ తగ్గినా కూడా అది మీ లోన్ భారాన్ని భారీగా పెంచేస్తుంది. ఇక ఈఎంఐ డీఫాల్ట్ అయితే బ్యాంకుకు కచ్చితంగా ఎక్కువ పెనాల్టీ కట్టాలి. లేట్ పేమెంట్ కారణంగా ఫీజులు, పెనాల్టీలు భారీగా పడతాయి. అలాగే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయి క్రిటికల్ లెవల్‌కు చేరిపోతుంది. తర్వాత మీకు తీసుకునే లోన్ పై వడ్డీ పెరిగిపోతుంది. కొన్ని బ్యాంకులు అయితే మీకు మళ్ళీ లోన్ కూడా ఇవ్వవు. సపోజ్ మీరు ఫలానా బ్యాంక్ లో హోమ్ లోన్ టాప్ అప్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. మీ సిబిల్ స్కోర్ 760 ఉన్నప్పుడు మీకు 9.10 శాతం వడ్డీ రేటుతో లోన్ వచ్చింది. అప్పుడు ఒకరోజు EMI కట్టడం ఆలస్యం అయితే మీ క్రెడిట్ స్కోర్ ఏకంగా 750కి పడిపోతుంది. దాంతో మీ వడ్డీ రేటు ఏకంగా 9.30 శాతానికి పెరిగిపోతుంది. దాంతో మీరు కట్టాల్సిన వడ్డీ ఏకంగా 50 వేలు ఎక్కువ పెరుగుతుంది. దీంతో మీకు భారీ నష్టాలు తప్పవు. కాబట్టి లోన్ తీసుకున్నప్పుడు కచ్చితంగా సరైన టయానికి EMI కట్టండి. లేదంటే భారీ మూల్యం తప్పదు. ఇదీ సంగతి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.