iDreamPost
android-app
ios-app

అదిరిపోయే పథకం.. మహిళలకు రూ.5 లక్షలు వడ్డీలేని రుణం!

మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారి ఆర్థిక అభివృద్ధి కోసం పలు పథకాలను తీసుకొచ్చింది. అలాంటి వాటిల్లో ఓ అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది. దీని ద్వారా అర్హులైన మహిళలు రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు.

మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారి ఆర్థిక అభివృద్ధి కోసం పలు పథకాలను తీసుకొచ్చింది. అలాంటి వాటిల్లో ఓ అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది. దీని ద్వారా అర్హులైన మహిళలు రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు.

అదిరిపోయే పథకం.. మహిళలకు రూ.5 లక్షలు వడ్డీలేని రుణం!

ఒక సమాజ అభివృద్ధిలో మహిళల కీలక పాత్ర పోషిస్తుంటారు. వారు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అందుకే సామాన్య మహిళలను కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. అలానే మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. మహిళల కోసం కేంద్రం ప్రారంభించిన పథకాల్లో కొన్ని అందరికి తెలియదు. అవి ఆడవారికి ఎంతగానే ఉపయోగపడతాయి. అలాంటి స్కీమ్ లో లఖపతి దీదీ అనే ప్రాజెక్ట్ ఒకటి. దీని ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు పొందవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళల కోసం పలు స్కీమ్స్ ను ప్రారంభించింది. అలాంటి వాటిల్లో లఖపతి దీదీ ప్రాజెక్ట్ ఒకటి. దీనిని 2023 ఆగష్టు 15న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ  పథకం ద్వారా మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వృత్తి శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన మహిళలు రూ.లక్ష నుండి రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు.

Lakhpati

అదే విధంగా ఆయా వ్యాపారలకు సంబంధించి.. నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కిల్ ట్రైనింగ్ తో పాటు వ్యాపారాన్ని ప్రారంభిండం, దానిని నిర్వహించడంపై సలహాలు పొందడంలో కూడా ఈ పథకం సహాయపడుతుంది. ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్‌లైన్ వ్యాపారంపై గైడ్ లైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 9 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు. ఇదే విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  వెల్లడించారు. అలానే ఆసక్తిగల మహిళలు ఈ పథకం కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

లఖపతి దీదీ స్కీమ్ లో చేరడానికి ఆసక్తిగల మహిళలు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఈ పథకానికి అర్హులు. ఇక ఈ పథకానికి డ్వాక్రా సంఘాల్లోని మహిళలు మాత్రమే అర్హులు. అలానే స్థానికత, ఆధార్ కార్డు వంటి పలు ధ్రువ పత్రాలు ఉండాలి. లఖపతి పథకంలోని అన్ని ప్రయోజనాలను పొందడానికి ఆధార్ కార్డ్, వయస్సు సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ అవసరం. అలానే అర్హులైన బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. మొబైల్ నంబర్ ఇమెయిల్ చిరునామా కూడా తప్పనిసరి.

Lakhpati

ఈ పథకం కోసం అప్లయ్ చేసే వారు.. వారి జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆఫీస్ ను సందర్శించాలి. అలానే లఖపతి దీదీ పథకానికి సంబంధించిన ఫారమ్‌ను అధికారులను అడిగి పొందవచ్చు. అలానే ఆ ఫారమ్ నింపే క్రమంలో ఏమైనా సందేహాలు ఉంటే.. అక్కడి అధికారులను అడగొచ్చు. అలా లఖపతి దీదీ పథకం దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను పూరించాలి. ఈ దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు రసీదు జారీ చేయబడుతుంది. ఇలా మహిళలు తమ కాళ్లపై సొంతంగా నిలబడి ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. మరి.. లఖపతి దీదీ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.