iDreamPost
android-app
ios-app

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?.. రూ. 10 లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

Credit Cards: క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి గుడ్ న్యూస్. క్రెడిట్ కార్డులు అందించే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ద్వారా ఏకంగా రూ. 10 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే?

Credit Cards: క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి గుడ్ న్యూస్. క్రెడిట్ కార్డులు అందించే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ద్వారా ఏకంగా రూ. 10 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే?

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?.. రూ. 10 లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

అత్యవసర సమయాల్లో ఆర్థిక కష్టాలను తీరుస్తుండడంతో క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరిగింది. అర్జెంటుగా డబ్బులు అవసరం అయినప్పుడు అప్పటికప్పుడు లోన్ దొరకదు. బయట అప్పు తీసుకుందామన్నా అధిక వడ్డీలు భారంగా మారుతాయి. ఇలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ ఫుల్ గా మారాయి. ట్రావెలింగ్, షాపింగ్, ఇతర ఖర్చులకు క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు రాకతో చేతిలో డబ్బు లేకపాయే అనే బాధ లేకుండా పోయింది. చేతిలో డబ్బు లేకపోయినా కావాల్సిన వస్తువులను కొనుక్కునే అవకాశం ఏర్పడింది. అవసరాలకు తగ్గట్టు ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ను యూజ్ చేస్తున్నారు. బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో కస్టమర్లకు క్రెడిట్ కార్డ్స్ ను ఇస్తున్నాయి.

శాలరీతో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డ్స్ ను అంటగడుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు కస్టమర్లకు కొన్ని రకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఉచితంగానే క్రెడిట్ కార్డుల ద్వారా అందే బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లైతే రూ. 10 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ క్రెడిట్ కార్డ్స్ అందించే ఇన్సూరెన్సులు ఏంటో ఇప్పుడు చూద్దాం.. క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందొచ్చు. ప్రయాణ సమయంలో వస్తువులను ఎవరైనా దొంగిలించినా, డ్యామేజీ జరిగినా బీమా కవరేజీ ఉంటుంది. అనారోగ్యానికి గురైనా, గాయపడినా బీమా కవరేజీ వస్తుంది.

క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడ అది నిర్దిష్ట వ్యవధిలోపు అంటే 90 రోజుల నుంచి 120 రోజుల లోపు దొంగతనానికి గురైనా లేదా పాడైపోయినా పర్చేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ బీమా కవరేజీ లభిస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై ఉన్న వారంటీని ఎక్స్‌టెండెడ్ వారంటీ ద్వారా ఒకటి లేదా రెండేళ్లపాటు పొడిగిస్తుంది. దీంతో వినియోగదారులకు లాభం చేకూరుతుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే అది డ్యామెజ్ అయినా లేక దొంగతానికి గురైన ఆ నష్టాన్ని బీమా కవరేజీ కవర్ చేస్తుంది.

ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు విక్రయదారు అంగీకరించకపోయినా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్లు చేస్తే కొన్ని వస్తువులను నిర్దిష్ట వ్యవధిలోపు తిరిగి ఇచ్చేందుకు రిటర్న్ ప్రొటెక్షన్ ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డులు కస్టమర్లకు యాక్సిడెంట్ కవరేజీని అందిస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అదనపు ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డులు అందించే బీమా సౌకర్యంతో రూ. 10 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది. క్రెడిట్ కార్డులు అందించే ఇన్సూరెన్స్ సౌకర్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.