iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు వచ్చే మార్పులు ఇవే!

New Rules in September 1: ఆగస్ట్ నెల మరి కొన్ని రోజుల్లో ముగియనున్నది. వచ్చే నెలలో పలు రంగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు జరిగే మార్పులు ఇవే.

New Rules in September 1: ఆగస్ట్ నెల మరి కొన్ని రోజుల్లో ముగియనున్నది. వచ్చే నెలలో పలు రంగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు జరిగే మార్పులు ఇవే.

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు వచ్చే మార్పులు ఇవే!

మరో ఐదు రోజుల్లో ఆగస్టు నెల ముగిసి.. సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతున్నది. కొత్త నెల ప్రారంభమవుతుందంటే ఫైనాన్స్ కు సంబంధించి అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, గ్యాస్ ధరలు, ఆధార్ కార్డ్ కు సంబంధించి ఇలా పలు రంగాల్లో కొత్త రూల్స్ వస్తుంటాయి. అలాగే గ్రాట్యుటీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక మార్పులు ఉండవచ్చు. ఈ మార్పులు ప్రజలపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంటాయి. సెప్టెంబర్ నెలలో ఏయే వాటిల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పుల వల్ల సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనున్నది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సెప్టెంబరులో జరిగే మార్పులు

ఎల్‌పీజీ ధరలు:

  • గ్యాస్ నిత్యావర వస్తువు. గ్యాస్ ధరల్లో చోటుచేసుకునే మార్పులు సామాన్యుల జేబులపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు, సీఎన్జీ ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

ఆధార్ కార్డు:

  • ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఐడెంటిఫికేషన్ కోసం కూడా ఆధార్ ఉపయోగపడుతుంది. ఇక ఆధార్ కార్డ్ పొంది 10 సంవత్సరాలు పూర్తైన వారు అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఆ తర్వాత మీరు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి రుసుము చెల్లించాలి. ఏవైనా మార్పులు ఉంటే వెంటనే చేయించుకోండి.

డీఏ చెల్లింపు:

  • సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాన్ని 3 శాతం పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) చెల్లిస్తున్నారు, ఇది 3 శాతం పెంపు తర్వాత 53 శాతానికి పెరుగుతుంది.

క్రెడిట్ కార్డ్ రూల్స్:

  • సెప్టెంబర్ 1 నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల కోసం రివార్డ్ పాయింట్ల పరిమితిని తీసుకొస్తుంది. దీని కింద కస్టమర్‌లు ఈ లావాదేవీలపై నెలకు 2,000 పాయింట్ల వరకు మాత్రమే పొందగలరు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా విద్యాపరమైన చెల్లింపులు చేసినందుకు ఎలాంటి రివార్డ్‌ను అందించదు.