TVS CNG Scooter: TVS నుంచి త్వరలో CNG స్కూటర్‌! ఇక డబ్బులు ఆదానే!

TVS నుంచి త్వరలో CNG స్కూటర్‌! ఇక డబ్బులు ఆదానే!

TVS CNG Scooter: అధిక పెట్రోల్ ధరలతో బాధపడుతున్నారా? ఇక మీ చింత తీరినట్టే. సీఎన్జీతో నడిచే స్కూటర్ త్వరలోనే రానున్నది. ఇక డబ్బులు ఆదా అవడం పక్కా.

TVS CNG Scooter: అధిక పెట్రోల్ ధరలతో బాధపడుతున్నారా? ఇక మీ చింత తీరినట్టే. సీఎన్జీతో నడిచే స్కూటర్ త్వరలోనే రానున్నది. ఇక డబ్బులు ఆదా అవడం పక్కా.

ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపుతున్నాయి ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థలు. తక్కువ ఖర్చుతో ప్రయాణించేలా అదే సమయంలో పర్యావరణహితంగా ఉండేలా బైకులను, కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇదివరకు పెట్రోల్ తో నడిచే బైకులు, స్కూటర్లు మార్కెట్ లో సందడి చేశాయి. టెక్నాలజీ మరింత డెవలప్ అవడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మార్కెట్ లోకి ప్రవేశించాయి. ఇక ఇప్పుడు వాహనదారులకు సీఎన్జీ బైకులు, స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు సీఎన్జీతో నడిచే ఆటోలు కార్లు మాత్రమే చూశాం. ఇకపై బైకులు, స్కూటీలు రాబోతున్నాయి. బజాజ్ బాటలోనే టీవీఎస్ కూడా సీఎన్జీ స్కూటీని తీసుకురాబోతోంది. ఇక వాహనదారులకు డబ్బులు ఆదాకానున్నాయి.

ప్రస్తుతం పెట్రోల్ ధరలు అధికంగా ఉండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే వాహనదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా టూవీలర్ తయారీ కంపెనీలు సీఎన్జీతో నడిచే బైకులు, స్కూటర్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల బజాజ్ కంపెనీ వరల్డ్ లోనే తొలి సీఎన్జీ బైక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫ్రీడమ్‌ 125 బైక్ ను విడుదల చేసి కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇప్పుడు టీవీఎస్ కూడా సీఎన్జీతో నడిచే స్కూటీని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఇది 2025 తొలి అర్ధభాగంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎన్జీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన టీవీఎస్ కంపెనీ సీఎన్జీ స్కూటీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది సక్సెస్ అయితే తొలి సీఎన్జీ స్కూటీ ఇదే అవుతుంది. టీవీఎస్ జుపిటర్ 125 ను సీఎన్జీ వేరియంట్ లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్నది. బజాజ్‌ ఫ్రీడమ్‌ తరహాలోనే దీంట్లో సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌ ఆప్షన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్రీడమ్‌ 125లో రెండు కేజీల సామర్థ్యం కలిగిన సీఎన్‌జీ, పెట్రోల్‌ ట్యాంకులు అమర్చారు. సీఎన్‌జీతో కేజీకి 102 కిలోమీటర్లు మైలేజీ, పెట్రోల్‌తో లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని బజాజ్‌ పేర్కొన్నది. మరి టీవీఎస్‌ తీసుకురానున్న సీఎన్జీ స్కూటీ ఎంత మైలేజ్ ఇవ్వనుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Show comments