SNP
కొన్ని రోజుల ముందు వరకు డిమాండ్ లేకపోవడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.. అయితే మళ్లి తాజాగా నాన్‌వెజ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్య జనం నాన్‌వెజ్ కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే.. నాన్‌వెజ్ ధరలు ఇంతలా పెరిగేందుకు కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
కొన్ని రోజుల ముందు వరకు డిమాండ్ లేకపోవడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.. అయితే మళ్లి తాజాగా నాన్‌వెజ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్య జనం నాన్‌వెజ్ కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే.. నాన్‌వెజ్ ధరలు ఇంతలా పెరిగేందుకు కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
కార్తీక మాసం పూర్తి అవ్వగానే ముందుగా భోజన ప్రియులకు.. అందులోనూ మాంసాహార ప్రియులకు గుర్తొచ్చేది చికెన్. ఇక కార్తీక మాసం ముగిసిపోవడంతో మాంసాహార ప్రియుల కన్ను చికెన్ మీద పడింది. దీనితో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాన్ వెజ్ కు డిమాండ్ బాగా పెరిగింది. వ్యాపారస్తులు దీనినే అదునుగా తీసుకుని నాన్ వెజ్ ధరలు పెంచేశారు. దీనితో మాంసాహార ప్రియులకు భారీ షాక్ తగిలింది. నిన్నటి వరకు కేజీ రూ.120 నుంచి రూ.150 ఉన్న చికెన్ ధర ఇప్పుడు దానికి రెట్టింపు ధర పలుకుతోంది. ఓ రకంగా నాన్ వెజ్ ప్రియులకు ఇది చేదు వార్త అని చెప్పొచ్చు.
ఈ నెల 12తో కార్తీక మాసం ముగిసిపోయింది. దీనితో మాంసాహార ప్రియులు చికెన్ షాప్స్ ముందు క్యూలు కట్టారు. ఇక నాన్ వెజ్ కు డిమాండ్ పెరగడంతో నిన్న మొన్నటి వరకు ఉన్న ధరలు కాస్త ఇప్పుడు దానికి డబుల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటివరకు కేజీ రూ.120 నుంచి రూ.150 ఉన్న చికెన్ ధర కాస్త ఇప్పుడు రూ. 200 నుంచి రూ.240 పలుకుతోంది. ఇలా ఒక్కసారిగా నాన్ వెజ్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక చేసేది ఏమి లేక.. అటు జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచలేక.. ప్రజలు ఉన్న ధరకే కొనుగోలు చేస్తున్నారు. సామాన్యులు మాత్రం కేజీ కొనాల్సిన చోట అరకేజీకే పరిమితం అవుతూ సర్దుకుపోతున్నారు.
కార్తీకమాసంలో తమ బిజినెస్ తగ్గడంతో పడిపోయిన నాన్ వెజ్ ధరలు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. కోళ్ల ఉత్పత్తికి, డిమాండ్ కు భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని తెలిపారు. పైగా, ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడంతో రేట్లు అధికంగా పెరిగాయని.. అదీ కాకుండా క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా వస్తుండడంతో.. నాన్ వెజ్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనికి తోడు సామాన్య ప్రజలు సైతం నాన్ వెజ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతుండడం కూడా ఓ కారణం అంటున్నారు.
దీనితో నాన్ వెజ్ ఎక్కువ తినేవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, చికెన్ తో పాటు మొన్నటి దాకా ఐదు రూపాయలు ఉన్న కోడిగుడ్డు.. ప్రస్తుతం ఏడు రూపాయలకు చేరుకుంది. మరో వైపు కూరగాయల ధరలు కూడా అధికంగా ఉన్నాయని, దీనికి కారణం అధిక డిమాండ్ అని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం మటన్ కూడా కేజీ రూ.800 నుంచి రూ.1000 పలుకుతోంది. ఇప్పుడున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదేమైనా, అమాంతంగా నాన్ వెజ్ ధరలు పెరగడం సామాన్యులకు కాస్త కష్టతరంగా మారింది. మరి, పెరుగుతున్న నాన్ వెజ్ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.