EVలు కొనాలనుకుంటున్నారా? కేంద్రం నుంచి షాకింగ్ న్యూస్!

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈవీలు కొనేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది.

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈవీలు కొనేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈవీలు కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈవీలు కొనేవారికి కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారులకు సబ్సిడీ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ న్యూస్ నిజంగా ఎలక్ట్రిక్ వాహన సంస్థలకు షాకింగ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేస్తూ కేంద్రం ఈవి కంపెనీలకు భారీ సబ్సిడీ అందిస్తుంది. ఇంతలో మంత్రి ఈ ప్రకటన చేయడం షాకింగ్ కి గురిచేస్తుంది. దీని కారణంగా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ధరలని పెంచుతాయి.

ప్రస్తుతం కొనుగోలుదారులు సొంతంగా ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను ఎంచుకునే స్థాయికి చేరుకున్నారని బీఎన్‌ఈఎఫ్‌ సమ్మిట్‌లో నితిన్ గడ్కారి చెప్పారు.ప్రారంభంలో ఈవీల తయారీదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించామని తెలిపారు. ఆ తర్వాతి క్రమంలో వీటికి డిమాండ్‌ ఊపందుకున్నదని అన్నారు. దీంతో ఈవీల ఉత్పత్తిపై పెట్టే ఖర్చులు తగ్గు ముఖం పట్టాయి. అందువల్ల ఈవీ సంస్థలకు ఇచ్చే రాయితీలు అనవసరమని కేంద్ర మంత్రి కామెంట్స్ చేశారు.ఇంకా మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల కంటే ఎలక్ట్రిక్‌ వాహనాలపై విధిస్తున్న జీఎస్టీ తక్కువ స్థాయిలో ఉందని అన్నారు.

హైబ్రిడ్స్‌ వెహికల్స్ పాటు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వలన ఎలక్ట్రిక్ కంపెనీలు వెహికల్స్ పై ధరలు పెంచే అవకాశం ఉంది. దాంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఇంకా పెరుగుతాయి. దాని కారణంగా సామాన్యులు ఈవీల్ని కొనలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మళ్ళీ పెట్రోల్ వాహనాలపై మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతో మళ్ళీ ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. మరి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments