nagidream
Central Government Extends EMPS Sceheme On Electric Vechicles: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు కొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ల్రామంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గిస్తూ..
Central Government Extends EMPS Sceheme On Electric Vechicles: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు కొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ల్రామంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గిస్తూ..
nagidream
ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం ఫేమ్-2 పథకం కింద సబ్సిడీ అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఫేమ్-2 సబ్సిడీ ముగిసిన తర్వాత ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం 2024’ను తాత్కాలికంగా తీసుకొచ్చింది. అయితే ఈ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా.. మరో రెండు నెలల పాటు అనగా సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటన చేసింది. అందుకోసం 778 కోట్ల రూపాయలను అదనంగా కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద 5 లక్షల 80 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు, అలానే 60 వేల 709 ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు మొత్తంగా 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే అధునాతన బ్యాటరీలతో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. ప్రైవేట్ లేదా కార్పొరేట్ యాజమన్యంలో రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కూడా ఈ సబ్సిడీ అందుతుందని తెలిపింది.
ఫేమ్-2 పథకం ముగియడానికి ముందు అనగా మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం 2024ని తీసుకొచ్చింది. 500 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు నెలల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది. జూలై 31 వరకూ 3,33,387 ఎలక్ట్రిక్ టూవీలర్స్ కి, 13,590 ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కి సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం నిధులను కేటాయించింది. అయితే జూలై 31తో గడువు ముగియనున్న క్రమంలో మరో రెండు నెలలు సబ్సిడీ పథకాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. సబ్సిడీ అందిస్తున్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనలేని పరిస్థితి చాలా మందిది. అయితే కొనాలని ఫిక్స్ అయిన వారికి ఈ సబ్సిడీ మేలు చేకూర్చే ప్రయోజనమనే చెప్పాలి.
ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలి అని ఫిక్స్ అయితే కనుక ఈ రెండు నెలల్లోగా కొనుక్కోవడం మంచిది. లేదంటే కేంద్రం ఇచ్చే సబ్సిడీ గడువు ముగిసిపోతే ఎలక్ట్రిక్ వాహనాలను ఉన్న ధరలకే కొనాల్సి వస్తుంది. అంటే సబ్సిడీ మీద మీకు ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే తగ్గుతుందో అంత అమౌంట్ మీరు గడువు ముగిసిపోయిన తర్వాత కొనుగోలు చేస్తే మీ మీద భారం పడుతుంది. ఉదాహరణకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ధర మీద 40 శాతం సబ్సిడీ వస్తుంది. అదే గడువు ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ 30 తర్వాత కొంటే ఆ 40 శాతం మీకు భారమే. కాబట్టి కొనాలనుకుంటే ఈ రెండు నెలల్లోగా కొనడమే మంచిది.