iDreamPost
android-app
ios-app

SBI వినియోగదారులకు కేంద్రం అలెర్ట్.. ఆ విషయంలో జాగ్రత్త!

SBI: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఇటీవలే ఎస్బీఐ బ్యాంకు సంబంధించి.. ఓ ఫేక్ మేసేజ్ సర్య్కూలేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు చేసింది.

SBI: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఇటీవలే ఎస్బీఐ బ్యాంకు సంబంధించి.. ఓ ఫేక్ మేసేజ్ సర్య్కూలేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు చేసింది.

SBI వినియోగదారులకు కేంద్రం అలెర్ట్.. ఆ విషయంలో జాగ్రత్త!

వినియోగదారులకు బ్యాంకులు అప్పుడప్పుడు శుభవార్తలు చెబుతుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, హోమ్ లోన్స్ పై వడ్డీ రేటు తగ్గించడం వంటివి కస్టమర్లకు ఊరటనిస్తాయి. ఇదే సమయంలో కొన్నిసార్లు బ్యాడ్ న్యూస్ లు, అలానే కీలక అలెర్ట్ లు ఇస్తుంటాయి. ఇదే సమయంలో కొన్ని కొన్ని బ్యాంకులకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తుంటాయి. అలానే ఆయా బ్యాంకుల వినియోగదారులకు కూడా పలు సందర్భాల్లో కొన్ని విషయాల్లో అప్రమత్తం చేస్తుంటాయి. తాజాగా ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానమైనది. దీని పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాక తన కస్టమర్లకు అనేక సేవలను అందిస్తుంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. తరచూ వచ్చే కొన్ని నకిలీ మేసేజ్ లపై కీలక సూచనలు చేసింది. ఎస్బీఐ ఖాతాలో రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్ మెసేజ్ తాజాగా సర్య్యూలేట్ అవుతోంది.

Sbi

ఈ క్రమంలో ఎవరైన తెలియక ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మోసపోతారు. దీంతో ఈ మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ కస్టమర్లకు సూచించింది. ఈ నకిలీ ఎస్ఎంఎస్ ల పట్ట జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోనూ రివార్డుల పేరుతో వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని ఎస్బీఐ వినియోగదారులకు తెలిపింది. వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకోవద్దని వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఈ హెచ్చరికను షేర్ చేసింది. అయితే, ఎస్బీఐ బ్యాంక్ కి  సంబంధించి ఇలాంటి అసత్య సందేశాలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో వివిధ ఫేక్ మెసేజ్ లు ఎస్బీఐ కస్టమర్లకు వచ్చాయి. అయితే సదరు బ్యాంక్ తమ వినియోగదారులను అలెర్ట్ చేసింది.

ఇక తాజాగా వచ్చిన ఫేక్ మెసేజ్ ఏంటంటే.., మీ ఎస్బీఐ నెట్ బ్యాకింగ్  రివార్డ్ పాయింట్ల (రూ. 9980.00) గడువు నేటితో ముగుస్తుందని, ఇప్పుడే ఎస్బీఐ రివార్డ్ యాప్ డౌన్ లోడ్  చేసుకుని ద్వారా రీడీమ్ చేసుకోవాలని తెలిపింది. అంతేకాక నేరుగా మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుందంటూ ఫేక్ మెసేజ్ సర్క్యూలేట్ అవుతోంది. ఈ క్రమంలోనే  ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ వినియోగదారులను కేంద్రం హెచ్చరించింది.