iDreamPost

కేంద్రం కీలక నిర్ణయం.. ఆ టాక్స్ తగ్గింపు! పెట్రోల్, డీజిల్ ధరలు..

ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నపటికీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని NDA గవర్నమెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నపటికీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని NDA గవర్నమెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

కేంద్రం కీలక నిర్ణయం.. ఆ టాక్స్ తగ్గింపు! పెట్రోల్, డీజిల్ ధరలు..

ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నపటికీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని NDA గవర్నమెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. మరీ ముఖ్యంగా ముడి చమురు విషయంలో టాక్స్ లను తగ్గిస్తూ.. ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు షాకిచ్చింది. తాజాగా మరో టాక్స్ ను తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభావితం కానున్నాయి. మరి కేంద్రం తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చమురు(క్రూడ్ పెట్రోలియం)పై విండ్ ఫాల్ టాక్స్ ను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు వరుసగా పెంచుకుంటూ పోయిన ఈ టాక్స్ ను.. తాజాగా తగ్గిస్తూ వస్తోంది కేంద్రం. వరుసగా మూడోసారి ఈ టాక్స్ ను తగ్గించింది కేంద్రం.. అది కూడా ఎన్నికల సమయంలోనే కావడం గమనార్హం. ముడి చమురుపై విండ్ ఫాల్ టాక్స్ ను రూ. 500 తగ్గించింది. దాంతో ప్రస్తుతం మెట్రిక్ టన్నుకు రూ. 5200 కు(62.33 డాలర్లు) చేర్చింది. తగ్గించకముందు ఇది రూ. 5700గా ఉంది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.

ఇదిలా ఉండగా.. ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్రం విండ్ ఫాల్ టాక్స్ లను సవరిస్తూ ఉంటుంది. అందులో భాగంగా అంతర్జాతీయంగా డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ఇక్కడ రేట్లను పెంచడం, తగ్గించడం లేగా స్థిరంగా ఉంచడం  జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే?  టాక్స్ తగ్గించినా కూడా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) రేట్లు ఏం మారలేదు. దీనిపై టాక్స్ జీరోగానే ఉంది.. పెట్రోల్ కు కూడా ఇదే వర్తిస్తుంది. కాగా.. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటే.. ఇక్కడ టాక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ధరలు తగ్గితే విండ్ ఫాల్ టాక్స్ తగ్గిస్తుంది. అయితే ఈ టాక్స్ తగ్గించినా, పెంచినా.. దేశియంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండకపోవచ్చు. కానీ వాటి ధరలు ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 107.41 గా ఉంది. లీటర్ డీజిల్ రూ. 95.65 వద్ద ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి