iDreamPost
android-app
ios-app

వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ట్రైన్ టికెట్లపై భారీ డిస్కౌంట్!.. మళ్లీ ఆ స్కీమ్ తెస్తోన్న కేంద్రం!

Train Tickets: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ట్రైన్ టికెట్లపై భారీ డిస్కౌంట్ అందించనున్న కేంద్రం. వారి కోసం మళ్లీ ఆ స్కీమ్ ను కేంద్రం తీసుకురాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Train Tickets: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ట్రైన్ టికెట్లపై భారీ డిస్కౌంట్ అందించనున్న కేంద్రం. వారి కోసం మళ్లీ ఆ స్కీమ్ ను కేంద్రం తీసుకురాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ట్రైన్ టికెట్లపై భారీ డిస్కౌంట్!.. మళ్లీ ఆ స్కీమ్ తెస్తోన్న కేంద్రం!

ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా.. సంక్షేమమే లక్ష్యంగా కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్ పేయర్స్ కి స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, సీనియర్ సిటిజన్లకు అందించే రాయితీ స్కీమ్ లను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు తీపికబురు అందించనున్నట్లు సమాచారం. సీనియర్ సిటిజన్లకు ట్రైన్ టికెట్లపై రాయితీ అందించే పథకాన్ని మళ్లీ తీసుకురానున్నదట.

రైల్వే శాఖ 60ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు గతంలో ట్రైన్ టికెట్లపై రాయితీ అందించేది. 2020కి ముందు రైలు టికెట్లపై 60 ఏళ్లు వయసు పైబడిన మహిళలకు 50 శాతం తగ్గింపు ఉండేది. పురుషులకు అయితే 50 శాతం రాయితీ కల్పించే వారు. ట్రాన్స్‌జెండర్ సీనియర్ సిటిజన్లకు 40 శాతం డిస్కౌంట్ ఇచ్చేది. దీంతో రైల్వే శాఖ కొంత ఆదాయాన్ని కోల్పోయేది. ఆ తర్వాత కేంద్రం రాయితీ స్కీమ్ ను ఎత్తి వేసింది. ఇప్పుడు మళ్లీ వారి కోసం రాయితీ స్కీమ్ ను తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తుంది. కోట్లాది మందికి ప్రయోజనం చేకూరనున్నది. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో పలు వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నట్లు సమాచారం ఊపందుకుంది.

రైల్వే నిబంధనల ప్రకారం 60 ఏళ్ల వయసు మించిన పురుషులు, ట్రాన్స్‌జెండర్లు, 58 ఏళ్లు దాటిన మహిళలను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. దురంతో, జన శతాబ్ది, రాజధాని వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లలో గతంలో సీనియర్లకు రాయితీ కల్పించింది కేంద్రం. ఇదిలా ఉంటే.. రైల్వే ప్రయాణికులు జనరల్ కోచ్ లను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారితో ట్రైన్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జనరల్ కోచ్ లు డిమాండ్ కు తగినన్ని లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రైన్లలో వీలైనన్ని జనరల్ బోగీలను పెంచాలని పలువురు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుంది రైల్వే శాఖ.