iDreamPost
android-app
ios-app

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే భారీ నష్టం!

  • Published Nov 14, 2024 | 12:02 PM Updated Updated Nov 14, 2024 | 12:02 PM

Pradhan Mantri Jan Dhan Yojana: బ్యాంక్ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అలర్ట్. ఈ పని వెంటనే చేయకపోతే నష్టం తప్పదు. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయండి. ఇంతకీ ఏం చేయాలంటే?

Pradhan Mantri Jan Dhan Yojana: బ్యాంక్ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అలర్ట్. ఈ పని వెంటనే చేయకపోతే నష్టం తప్పదు. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయండి. ఇంతకీ ఏం చేయాలంటే?

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే భారీ నష్టం!

బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు బ్యాంకింగ్ రూల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బ్యాంకు నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. ఖాతా యాక్టివ్ గా పనిచేయాలంటే రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. నేటి రోజుల్లో దాదాపు అందరూ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటున్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ ను తీసుకొస్తున్నది. అవకతవకలు, మోసాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చి అమలు చేస్తున్నది. కాగా దేశంలోని సామాన్యులందరికీ బ్యాంక్ సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాలను ప్రారంభించింది. పేదలకు బ్యాంక్ అకౌంట్ ఉండాలని జన్ ధన్ ఖాతాలను తీసుకొచ్చింది.

జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది. జన్ ధన్ ఖాతాతో రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనాలను పొందొచ్చు. అత్యవసర సమయాల్లో రూ. 10 వేల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని కూడా ఈ ఖాతాద్వారా పొందొచ్చు. జన్‌ధన్‌ ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. అయితే జన్ ధన్ ఖాతాలు కలిగిన వారికి కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. మరి మీకు కూడా జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పని చేయండి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏం చేయాలంటే.. జన్ ధన్ అకౌంట్స్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తైంది.

ఈ తరుణంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన అకౌంట్ల కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కేవైసీ అప్ డేట్ చేసుకోకపోతే ఖాతా నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కేవైసీ అప్‌డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అత్యవసర సమయాల్లో ఖాతాలోని డబ్బును విత్ డ్రా చేసుకోలేరు. కాబట్టి, తప్పనిసరిగా కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.

జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్‌డేట్ చేయడానికి ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు అడ్రస్ ప్రూఫ్ కింద కరెంట్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్‌లలో ఏదైనా ఒకదాన్ని ఇవ్వాలి. అవసరమైతే ఫోన్ నంబర్, ఇమెయిల్ అదనంగా ఇవ్వొచ్చు. బ్యాంకుకు వెళ్లి అవసరమైన డాక్యూమెంట్స్ ను అందించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. జన్ ధన్ ఖాతాదారులు మీ ఖాతా యాక్టివ్ గా ఉండాలంటే వెంటనే కేవైసీ అప్ డేట్ చేసుకోవడం ఉత్తమం.