P Venkatesh
BSNL Recharge Plan: BSNL కస్టమర్లకు అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. రోజుకు 2 రూపాయలతో అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?
BSNL Recharge Plan: BSNL కస్టమర్లకు అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. రోజుకు 2 రూపాయలతో అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?
P Venkatesh
టెలికాం రంగంలో BSNL జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. BSNL వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నది. వేలాది మంది ఇతర నెట్ వర్క్స్ నుంచి BSNLకు మారుతున్నారు. ఈ ఏడాది జులైలో దిగ్గజ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్ టెల్, వీఐ టారీఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్ యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే BSNLకు మొబైల్ యూజర్స్ క్యూ కట్టారు. BSNL 4జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకురావడంతో BSNL సిమ్ కార్డుల కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు BSNL అదిరిపోయే రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నది. మిగతా టెలికాం కంపెనీలకు గట్టిపోటినిస్తుంది.
దిగ్గజ టెలికాం కంపెనీల తిక్క కుదిరిస్తున్నది. ఈ క్రమంలో BSNL దీపావళి పండగ వేళ కస్టమర్ల కోసం బంపరాఫర్ ప్రకటించింది. కళ్లు చెదిరే బెనిఫిట్స్ తో న్యూ రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం రోజుకు రెండున్నర రూపాయలతో అంటే 797 తో క్రేజీ రీచార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అదే విధంగా డైలీ 2జీబీ డేటా అందుకోవచ్చు. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం కంపెనీ 300 రోజుల వ్యాలిడీటి అందించడం లేదు. మరి ఎక్కువ రోజుల వ్యాలిడిటీ.. డేటా ఎక్కువ కావాలనుకునే వారు ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి. BSNL తీసుకొచ్చిన రూ. 797 రీచార్జ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కానీ, మొదటి 60 రోజులపాటు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా,100SMSలతో 120GB డేటాను అందిస్తుంది.
60 రోజుల తర్వాత వాయిస్ కాల్స్, ఎస్ ఎంఎస్ లు కొనసాగించాలనుకుండే టాప్ అప్ ప్లాన్లతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నెట్ డేటా మాత్రం 300 రోజులు అందుబాటులో ఉంటుంది. కానీ, 60 రోజుల తర్వాత దాని వేగం 40kpbs పడిపోతుంది. తక్కువ ధరలో ధీర్ఘకాలిక ప్లాన్స్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఎక్కువ కాలం సిమ్ ఆక్టివ్ లో ఉంచాలనుకునే వారికి ఇది సరైన రీచార్జ్ ప్లాన్. BSNL నుంచి మరో అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. చౌక ధరలో 52 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. BSNL కొత్తగా అందిస్తున్న రూ. 298 రీఛార్జ్ ప్లాన్ తో రీచార్జ్ చేయిస్తే 52 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు పంపుకోవచ్చు. డైలీ 1జీబీ డేటా అందుకోవచ్చు. మరి BSNL చౌక ధరలో అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.