iDreamPost
android-app
ios-app

BSNL మాస్టర్ ప్లాన్.. ఎయిర్‌టెల్, జియోకి మరో భారీ దెబ్బ! ఈ దూకుడేంటి స్వామి!

  • Published Aug 04, 2024 | 1:28 PM Updated Updated Aug 04, 2024 | 1:28 PM

Bsnl Aggressive Move To Launch 4G Services In Top Cities Within 15th August And Across The State On Month End September: బీఎస్ఎన్ఎల్ తన దూకుడు పెంచేసింది. ఈ దూకుడుతో జియో, ఎయిర్ టెల్ లాంటి నెట్వర్క్ లకి మరో దెబ్బ పడనుంది. ఇప్పటికే ఈ నెట్వర్క్ ల నుంచి లక్షల్లో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కి జంప్ అయ్యారు. కొత్తగా లక్షల మంది చేరారు. అయితే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్ తో మరో భారీ దెబ్బ పడనుంది.

Bsnl Aggressive Move To Launch 4G Services In Top Cities Within 15th August And Across The State On Month End September: బీఎస్ఎన్ఎల్ తన దూకుడు పెంచేసింది. ఈ దూకుడుతో జియో, ఎయిర్ టెల్ లాంటి నెట్వర్క్ లకి మరో దెబ్బ పడనుంది. ఇప్పటికే ఈ నెట్వర్క్ ల నుంచి లక్షల్లో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కి జంప్ అయ్యారు. కొత్తగా లక్షల మంది చేరారు. అయితే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్ తో మరో భారీ దెబ్బ పడనుంది.

BSNL మాస్టర్ ప్లాన్.. ఎయిర్‌టెల్, జియోకి మరో భారీ దెబ్బ! ఈ దూకుడేంటి స్వామి!

జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు తమ టారిఫ్ ధరలను భారీగా పెంచేయడంతో చాలా మంది యూజర్లు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వైపే వెళ్లిపోతున్నారు. తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందిస్తుండడంతో లక్షల్లో కస్టమర్లు ఇతర నెట్ వర్క్ ల నుంచి బీఎస్ఎన్ఎల్ కి వచ్చేశారు. ఏపీలో జూలై నెలలో ఏకంగా 2.17 లక్షల మంది కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి షిఫ్ట్ అయ్యారు. ఇది బీఎస్ఎన్ఎల్ రికార్డు. ఈ రికార్డుతో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల సంఖ్య 40 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుండడం.. 5జీ సేవలపై దృష్టి సారించడం.. ఇప్పటికే 5జీ సేవల ట్రయల్స్ ని ప్రారంభించడం, తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో 5జీ సిమ్ కార్డులను లాంఛ్ చేయడం వంటి చర్యలతో బీఎస్ఎన్ఎల్ దూకుడుగా వ్యవహరిస్తుండడం వల్ల కస్టమర్లు కూడా కొత్త కనెక్షన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం కస్టమర్లకే కాదు.. కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి షిఫ్ట్ అవుదామా వద్దా అని ఆలోచించేవారికి కూడా గుడ్ న్యూసే. 4జీ సేవలను ఆగస్టు 15 నాటికి ప్రధాన నగరాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలాఖరుకు తీసుకొచ్చేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. ప్రస్తుతం యాంటినాలు, బేస్ ట్రాన్సివర్ స్టేషన్స్, కోర్ నెట్వర్క్ పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాలకే కాకుండా గిరిజన ప్రాంతాలకు కూడా 4జీ సేవలను విస్తరించేలా బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టింది. మారుమూల గ్రామాల్లో అలానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా 1200 టవర్లను ఏర్పాటు చేస్తుంది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కర్నూలు వంటి జిల్లాల్లోని గ్రామాల్లో ఈ నెలాఖరులోగా బీఎస్ఎన్ఎల్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

4జీ సేవలు అందుబాటులోకి వస్తుండడంతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 2జీ నుంచి 4జీకి అప్ గ్రేడ్ అయ్యేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి.. 4జీ నెట్వర్క్ కి అప్ గ్రేడ్ అయ్యేలా ప్రోత్సహించనున్నారు. బీఎస్ఎన్ఎల్ యూజర్లు తమ సిమ్ కార్డుని అప్ గ్రేడ్ చేసుకోవడం ద్వారా 4జీ సేవలను పొందగలుగుతారు. ఇక బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుంటున్నవారిలో 90 శాతం మంది రూ. 249 రీఛార్జ్ ప్లాన్ నే ఎంచుకుంటున్నారని సంస్థ తెలిపింది. 45 రోజుల వ్యాలిడిటీతో డైలీ 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్ లు ఇస్తుండడంతో బీఎస్ఎన్ఎల్ కి క్యూ కడుతున్నారు.

మొత్తానికి బీఎస్ఎన్ఎల్ యుద్ధ ప్రాతిపదికన 4జీ సేవలను ఏపీలోని ప్రధాన నగరాల్లో ఆగస్టు 15 నాటికి, రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలాఖరుకి 4జీ సేవలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతుంది. 4జీ నెట్వర్క్ అందుబాటులో లేకున్నా గానీ లక్షల మంది బీఎస్ఎన్ఎల్ లోకి వెళ్లిపోయారు. ఇక పూర్తి స్థాయిలో 4జీ సేవలు వస్తే ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ లకి భారీ దెబ్బ పడడం ఖాయమనిపిస్తుంది. 4జీకే ఇలా ఉంటే 5జీ సేవలు అందుబాటులోకి వస్తే సీన్ ఇంకెలా ఉంటుందో ఊహిస్తేనే సినిమా క్లైమాక్స్ ని తలపిస్తుంది. అంతా రతన్ టాటా మహిమ. ఇది ఒక రకంగా కస్టమర్స్ కి గుడ్ న్యూసు.. ఇతర నెట్వర్క్ లకి బ్యాడ్ న్యూసు. మరి మీ అభిప్రాయమేంటి బాసు.