iDreamPost
android-app
ios-app

BSNL Fiber Plan Offer: ఫైబర్ బేసిక్ ప్లాన్‌ని రూ.399కి తగ్గించిన BSNL! 60 MBPS స్పీడ్‌తో అపరిమిత డేటా!

  • Published Aug 10, 2024 | 7:26 AM Updated Updated Aug 10, 2024 | 7:26 AM

BSNL Started Another Game: ఇన్నాళ్లు సోసోగా నడిచిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు అసలు ఆట మొదలుపెట్టింది. ప్రైవేట్ కంపెనీల పెత్తనానికి చెక్ పెడుతూ తక్కువ ధరకే ప్లాన్స్ ని అందిస్తూ సరికొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరో కొత్త నిర్ణయం తీసుకుంది.

BSNL Started Another Game: ఇన్నాళ్లు సోసోగా నడిచిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు అసలు ఆట మొదలుపెట్టింది. ప్రైవేట్ కంపెనీల పెత్తనానికి చెక్ పెడుతూ తక్కువ ధరకే ప్లాన్స్ ని అందిస్తూ సరికొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరో కొత్త నిర్ణయం తీసుకుంది.

BSNL Fiber Plan Offer: ఫైబర్ బేసిక్ ప్లాన్‌ని రూ.399కి తగ్గించిన BSNL! 60 MBPS స్పీడ్‌తో అపరిమిత డేటా!

టాటా గ్రూప్ తో భాగస్వామ్యం అయ్యాక బీఎస్ఎన్ఎల్ దూకుడు పెంచేసింది. జియో, ఎయిర్ టెల్ కంపెనీలకు వరుసపెట్టి షాక్ లిచ్చుకుంటూ పోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ టెలికాం కంపెనీ తొలిసారిగా ప్రైవేట్ కంపెనీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. బీఎస్ఎన్ ఎల్ దెబ్బకి జియో, ఎయిర్ టెల్ కంపెనీలు వెళ్ళిపోయిన కస్టమర్స్ ని వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్ కొత్తగా మాన్సూన్ డబుల్ బొనాంజా ఆఫర్ ని ప్రకటించింది. ఈ ప్రకటనతో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో కూడా సంచనలం క్రియేట్ చేయనుంది. దేశంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలో కనెక్టివిటీ కలిగిన బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో వెనుకబడింది.

అయితే టాటా గ్రూప్ కంపెనీ పెట్టిన 15 వేల కోట్ల పెట్టుబడితో బీఎస్ఎన్ఎల్ దూకుడు పెంచింది. బీఎస్ఎన్ఎల్ లోకి వచ్చే వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీనికి కారణం ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ధరలను పెంచడమే. తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ని అందిస్తుండడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి షిఫ్ట్ అయిపోయారు. మరోపక్క బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలను విస్తృతంగా అందించే దిశగా రంగం సిద్ధం చేసుకుంది. బీఎస్ఎన్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు టాటా గ్రూప్ వెయ్యి 4జీ టవర్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచనుంది. 4జీ ఇంటర్నెట్ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు చేస్తుంది. అలానే 5జీ నెట్వర్క్ కి కూడా అప్డేట్ అవుతుంది.

ఇప్పటికే  5జీ సిమ్ కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 5జీ సేవలను త్వరలోనే అందించేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ దూకుడు కారణంగా ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇది సరిపోదన్నట్టు బీఎస్ఎన్ఎల్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్లాన్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కొత్త కస్టమర్స్ ని సృష్టించుకునేందుకు ‘మాన్సూన్ డబుల్ బొనాంజా’ ఆఫర్ ని లాంచ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ టెలికాం కంపెనీ ఎక్స్ అధికారిక ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కంపెనీ.. 4జీ, 5జీ ఇంటర్నెట్ సేవలను, భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడం కోసం స్వదేశీ టెక్నాలజీ మీద దృష్టి సారించిందని తెలిపింది. లోకల్ ఎక్విప్మెంట్ ని వినియోగించి బీఎస్ఎన్ఎల్ మొబైల్, బ్రాండ్ బ్యాండ్ నెట్వర్క్ ని అమలు చేసిందని వెల్లడించింది.        

మాన్సూన్ డబుల్ బొనంజా ఆఫర్ ప్రత్యేకత ఏమిటి?:

ఈ ఆఫర్ ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ 3300 జీబీ హై స్పీడ్ డేటా ఇంటర్నెట్ ప్లాన్ ని అతి తక్కువ ధరకే అందిస్తుంది. అది కూడా ప్రతీ గ్రామీణ ప్రాంతంలో కూడా అందుబాటులో ఉండేలా. ఈ ప్లాన్ ఖరీదు నెలకు రూ. 499. అయితే ఈ ప్లాన్ తీసుకున్న వారికి మొదటి 3 నెలలు వంద రూపాయల తగ్గింపు ఇస్తుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ ప్లాన్ ని రూ. 399కే మూడు నెలల పాటు పొందవచ్చు. ఆ తర్వాత రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వినియోగదారులకు మాత్రం మొదటి నెల ఉచితంగా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.  

ఇంటర్నెట్ స్పీడ్ ఎంతంటే?:

3300 జీబీ డేటాతో పాటు బ్రాడ్ బ్యాండ్ యూజర్లు అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా పొందుతారు. 60 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ అనేది వస్తుంది. డేటా లిమిట్ అయిపోతే కనుక 4 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తుంది. మొత్తానికి ఈ ప్లాన్ తో అపరిమిత ఇంటర్నెట్ అయితే పొందవచ్చు.