iDreamPost
android-app
ios-app

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. BSNL సూపర్ ప్లాన్.. అదేంటంటే?

  • Published Aug 13, 2024 | 11:25 AM Updated Updated Aug 13, 2024 | 11:25 AM

BSNL: టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ కి ఆదరణ పెరిగింది. లక్షలాది మంది కొత్త యూజర్లు వచ్చి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో మరో సూపర్ ప్లాన్ చేస్తున్నది. ఇంతకీ అదేంటంటే?

BSNL: టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ కి ఆదరణ పెరిగింది. లక్షలాది మంది కొత్త యూజర్లు వచ్చి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో మరో సూపర్ ప్లాన్ చేస్తున్నది. ఇంతకీ అదేంటంటే?

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. BSNL సూపర్ ప్లాన్.. అదేంటంటే?

టెలికాం రంగంలో ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పెను సంచలనంగా మారనుందా? అనే సందేహాలకు ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో బీఎస్ ఎన్ఎల్ సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తుంది. 4జీ సర్వీసులను ప్రారంభించి దేశమంతటా విస్తరించేందుకు రెడీ అవుతోంది. 5జీ రెడీ సిమ్ కార్డులను సైతం యూజర్లకు పంపిణీ చేస్తున్నది. బీఎస్ఎన్ఎల్ ముందు చూపుకు టెలికాం సంస్థల్లో వణుకు పుడుతోంది. ప్రైవేట్ టెలికాం సంస్థల తిక్క కుదిర్చేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ చేస్తున్నది. త్వరలోనే 5జీ సర్వీసులను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తే యూజర్లకు పండగే.

గత నెలలో ప్రముఖ టెలికాం కంపెనీలు టారీఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచాయి. ఈ దెబ్బతో యూజర్ల నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. రీఛార్జ్ ధరల పెంపుతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారారు. యూజర్లను ఆకట్టుకునేందుకు.. వారి సంఖ్యను భారీగా పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ ఏడాది చివరి నాటికి పల్లెలు పట్టణాల్లో 4జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.

BSNL

ఇక ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీలకు చెక్ పెట్టేందుకు ముందు చూపుతో బీఎస్ఎన్ఎల్ యూజర్లకు 5జీ రెడీ సిమ్ లను అందిస్తోంది. వీలైనంతా త్వరగా 5జీ సర్వీసులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే తక్కువ ధరతో ఎక్కువ ప్రయోజనాలు అందించే రీఛార్జ్ ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న బీఎస్ఎన్ఎల్ 5జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చి టెలికాం రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది. బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తే మిగతా టెలికాం కంపెనీలకు కొరకరాని కొయ్యగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.