iDreamPost
android-app
ios-app

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. BSNL కీలక నిర్ణయం.. ప్లాన్ మామూలుగా లేదుగా

  • Published Aug 19, 2024 | 10:19 PM Updated Updated Aug 19, 2024 | 10:19 PM

BSNL: టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తున్నది. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు 4జీ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

BSNL: టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తున్నది. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు 4జీ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. BSNL కీలక నిర్ణయం.. ప్లాన్ మామూలుగా లేదుగా

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడా ఫోన్ ఐడియా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. రీఛార్జ్ ధరల పెంపుతో మొబైల్ యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్లను అందించే బీఎస్ఎన్ఎల్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే లక్షలాదిమంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారారు. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు సూపర్ ప్లాన్స్ ను తీసుకొస్తుంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ యూజర్లకు తీపి కబురును అందించింది. దేశ వ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా 4జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్లో బీఎస్ఎన్ఎల్ 4జీ ట్రయల్స్ పూర్తయ్యాయి. 4జీ ట్రయల్స్ ఆశాజనకంగా ఉండటంతో అక్టోబర్ 2024 నుంచి దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ రెడీ అవుతోంది. ఆ తర్వాత 5జీ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026 వరకు బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు వచ్చే అవకాశం ఉన్నట్లు టెలికాం వర్గాలు భావిస్తున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రైవేట్ టెలికాం సంస్థల తిక్క కుదిర్చినట్టు అవుతుంది. బీఎస్ఎన్ ఎల్ యూజర్లకు తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు, బెనిఫిట్స్ అందుబాటులోకి వస్తాయి.

బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం 4జీ సిమ్ కార్డ్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పటికే 5జీ సిమ్ కార్డులను సైతం పంపిణీ చేస్తున్నది. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు మెరుగుపడాల్సి ఉంది. మెరుగైన సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు మిగతా టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ లో రీచార్జ్ ప్లాన్ల ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ కారణంతో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు కస్టమర్లు క్యూ కడుతున్నారు.