iDreamPost
android-app
ios-app

రూ.4 లక్షలతో మొదలై.. ఇప్పుడు రూ.7000 కోట్ల సామ్రాజ్యం! బిస్లరీ సక్సెస్ స్టోరీ

Bisleri: నీళ్లు కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని కొన్నే క్రితం ఎవరైనా అనుకున్నారా? అయితే మన దేశంలో నీళ్ల బాటిల్ వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉంటుందని 50 ఏళ్ల క్రితమే అంచనా వేసిన ఓ వ్యక్తి ఉన్నాడు.

Bisleri: నీళ్లు కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని కొన్నే క్రితం ఎవరైనా అనుకున్నారా? అయితే మన దేశంలో నీళ్ల బాటిల్ వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉంటుందని 50 ఏళ్ల క్రితమే అంచనా వేసిన ఓ వ్యక్తి ఉన్నాడు.

రూ.4 లక్షలతో మొదలై.. ఇప్పుడు రూ.7000 కోట్ల సామ్రాజ్యం! బిస్లరీ సక్సెస్ స్టోరీ

ప్రతి మనిషిలో ఆలోచన అనేద కచ్చితంగా ఉంటుంది. అలా ఆలోచనలు లేని వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అయితే కొందరు మాత్రం సమాజంలో జరుగుతున్న పరిణామాలను ముందుగానే గుర్తించి.. అందుకు అవసరమైన వాటిని ప్రారంభిస్తుంటారు. అలానే  ఓ వ్యక్తి 25 ఏళ్ల క్రితమే నీళ్లను కూడా కొనాల్సి వస్తుందని గుర్తించాడు. చాలా మందికి ఆ సమయంలో అది పిచ్చి ఆలోచన అని నవ్వుకుంటారు. కానీ అందురూ నవ్వుకున్నా ఆయన ప్రారంభించిన వాటర్ బాటిల్ వ్యాపారం నేడు వేల కోట్ల రూపాయలు అర్జిస్తుంది.  మరి.. ఆ వ్యక్తి ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బిస్లరీ.. ఈ పేరు తెలియని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. కారణంగా బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, హోటళ్లు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపించే వాటర్ బాటిల్ బిస్లరీ. పైన మనం చొప్పుకున్న వ్యక్తే ఈ బిస్లరీ సంస్థల యజమాని. ఆయన పేరు రమేష్  చౌహన్. మన దేశం భారతదేశంలో బాటిల్ వాటర్ వ్యాపారానికి గుర్తింపు ఇచ్చింది ఇతనే. చౌహాన్ 1969లో బిస్లరీ వ్యాపారం ప్రారంభించారు. ఆ సంస్థను కొనుగోలు చేసినప్పుడు డబ్బుతో కొనుక్కుని నీళ్లు  ఎవరు తాగుతారని అందరు నవ్వుకున్నారు. అలా సంఘటన జరిగి దాదాపు 50 ఏళ్లు తరువాత.. అంటే ప్రస్తుతం ప్రతి వీధిలో, జంక్షన్లలో హోటళ్లలో బిస్లరీ బాటిల్స్ పెద్ద ఎత్తున్న విక్రయించబడుతున్నాయి.

1969 లో బిస్లరీ సంస్థను రమేష్ చౌహన్ కుటుంబం  రూ.4 లక్షలకు కొనుగోలు చేసింది. వారి సంస్థ అయినే పార్లే బిస్లరీ ని కొనుగోలు చేసింది. ఇది ఇటాలియన్ బ్రాండ్. ఇక చౌహన్ కుటుంబం బిస్లరీ  బిజినెస్ ను కొనుగోలు చేసినప్పుడు  అందరు నవ్వుకున్నారు. నీటిని ఎవరు కొంటారు.. ఇక ఈ బిజినెస్ దివాల తీయాల్సిందే అని భావించారు. అది కొనుగోలు  చేసిన సమయంలో చౌహాన్ వయస్సు 28 ఏళ్లు. ఇక బిస్లరీ సంస్థను కొనుగోలు చేసిన 25 ఏళ్ల తర్వాత పూర్తిగా రమేష్ చౌహాన్ చేతుల్లోకి వచ్చింది. రమేష్ ఆలోచనలతో బిస్లరీ బాటిల్ వాటర్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. అలా మినరల్ వాటర్ వ్యాపారంలో ఒక మాములు సంస్థగా ఉన్న బిస్లరీ ఇప్పుడు టాప్ లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.7000 కోట్ల కంటే ఎక్కువ ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి.

రమేశ్ చౌహన్ బిస్లరీతో పాటు థమ్ సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మజా, లిమ్కా వంటి బ్రాండ్ లను కూడా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేశారు. వారు 2016లో  స్పైసీ, లిమోనాటా, ఫోంజో,పినాకోలాడా అనే నాలుగు అద్భుతమైన రుచులతో ‘బిస్లెరీ POP’ని ప్రారంభించారు.  నాడు రూ.4 లక్షలకు కొనుగోలు చేసిన సంస్థ నేడు వేల కోట్ల విలువ చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిస్లరీకి 122 ప్లాంట్లు, 4500 డిస్ట్రిబ్యూటర్లు,5000 డిస్ట్రిబ్యూషన్ ట్రక్కులు ఉన్నాయి. ప్రతిరోజూ 2 కోట్ల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తోంది. చూశారా.. ముందు చూపు.. భవిష్యత్ ఎలా ఉండబోతుందనే అంచనా వేసిన వ్యక్తి నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండే.. వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వీరి జీవితం ఎంతో మందికి ఆదర్శం. మరి.. రమేశ్ చౌహాన్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.