iDreamPost
android-app
ios-app

2024లో బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్.. ఏది కొంటే మంచిది?

  • Published Jul 06, 2024 | 6:10 PM Updated Updated Jul 06, 2024 | 6:10 PM

Best Android Tablets To Buy: ఎలాంటి ట్యాబ్లెట్ కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నారా? ఏది కొనుక్కుంటే బాగుంటుంది? అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. సాధారణ వినియోగం నుంచి గేమ్స్ ఆడవారి వరకూ ఎలాంటి ట్యాబ్ సెట్ అవుతుందో అనేది ఈ కథనంలో చెప్పబడింది.

Best Android Tablets To Buy: ఎలాంటి ట్యాబ్లెట్ కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నారా? ఏది కొనుక్కుంటే బాగుంటుంది? అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. సాధారణ వినియోగం నుంచి గేమ్స్ ఆడవారి వరకూ ఎలాంటి ట్యాబ్ సెట్ అవుతుందో అనేది ఈ కథనంలో చెప్పబడింది.

2024లో బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్.. ఏది కొంటే మంచిది?

2024లో బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ ఏంటి? వీటిలో ఏది కొంటే మంచిది అని మీరు ఆలోచనలో ఉంటే గనుక మీకు ఈ ఆర్టికల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. శాంసంగ్, వన్ ప్లస్, గూగుల్, లెనోవో, షావోమీ వంటి టాప్ బ్రాండ్స్ నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ ధర నుంచి బడ్జెట్ ధరలో ఉన్న ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇందులో ఏ ట్యాబ్ దేని పర్పస్ వాడుకోవచ్చు అనేది కూడా ఉంది. మరి 2024లో బెస్ట్ ట్యాబ్స్ ఏంటి? వాటి ఫీచర్స్? ధర వంటి వివరాలు మీ కోసం. 

శాంసంగ్ ట్యాబ్ ఎస్9 అల్ట్రా:

ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ లో శాంసంగ్ ట్యాబ్ ఎస్9 అల్ట్రా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ తో వస్తుంది. డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లేతో 11 అంగుళాల స్క్రీన్ సైజుతో 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 1848×2960 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. ఐపీ68 సర్టిఫైడ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 13 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరాలు, 12+12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఇచ్చారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 93,999 కాగా ఆన్ లైన్ లో రూ. 83,999 పడుతుంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డుల మీద 6 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ట్యాబ్ లెట్ ని కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

వన్ ప్లస్ ప్యాడ్:

కంటెంట్ వినియోగం కోసం వన్ ప్లస్ ప్యాడ్ బెస్ట్. ఇది 11.6 అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. 2408×1720 రిజల్యూషన్ తో 144 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఆన్ లైన్ లో దీని ధర రూ. 23,999గా ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్:

ఇంట్లో కాలక్షేపం కోసం వాడుకోవాలి అనుకునేవారికి గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ మంచి ఆప్షన్. ఇది 11 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. 1600×2500 పిక్సెల్ రిజల్యూషన్ తో, 60 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 91,990 కాగా ఆఫర్ లో రూ. 59,990కి పొందవచ్చు. కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9+:

మీకు గేమ్స్ ఆడడం అంటే ఇష్టమా.. అయితే మీకు ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9+ బెస్ట్ ఆప్షన్. ఇది 12.4 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే, 2800×1752 రిజల్యూషన్ తో వస్తుంది. 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఎస్ పెన్, వైఫై+ 5జీ సపోర్ట్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 1,17,599 కాగా.. ఆఫర్ లో రూ. 1,04,999 పడుతుంది. కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

షావోమీ ప్యాడ్ 6:

మీరు పెట్టిన డబ్బుకి విలువైన ట్యాబ్లెట్ గా ఈ షావోమీ ప్యాడ్ 6 ఉంటుంది. ఇది 11 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ తో వస్తుంది. 144 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో.. 2880×1800 రిజల్యూషన్ తో వస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 870 ఎస్ఓసీ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 41,999 కాగా ఆఫర్లో రూ. 28,999కే అందుబాటులో ఉంది. కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

లెనోవో ట్యాబ్ పీ12:

డ్రాయింగ్ వేసుకునే వారికి ఈ లెనోవో ట్యాబ్ పీ12 బెస్ట్ ఆప్షన్. 12.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో, 3కే రిజల్యూషన్ తో వస్తుంది. పెన్, ఫోలియో కేసు కూడా ఇస్తున్నారు. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 42 వేలు కాగా రూ. 28,999కే సొంతం చేసుకోవచ్చు. కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

రెడ్మి ప్యాడ్ ఎస్ఈ:

బడ్జెట్ లో ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి రెడ్మీ ప్యాడ్ ఎస్ఈ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఇది 11 అంగుళాల స్క్రీన్ తో, 90 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 14,999 కాగా ఆఫర్లో రూ. 12,999కే అందుబాటులో ఉంది. కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.