Post Office: రూ.50 డిపాజిట్ చేస్తే.. చేతికి 31 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ నుంచి సూపర్ స్కీమ్!

Post Office: డబ్బులు పొదుపు చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎన్నో లాభాలను ఇస్తాయి.

Post Office: డబ్బులు పొదుపు చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎన్నో లాభాలను ఇస్తాయి.

మనం డబ్బులు పొదుపు చేసుకోవాలే కానీ ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ పథకాలు మన కుటుంబ భవిష్యత్తుని సురక్షితంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. పోస్ట్ ఆఫీస్ మనకు ఎన్నో మంచి మంచి పథకాలను ప్రవేశపెడుతుంది. ఆ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా ఎన్నో లాభాలు సొంతం చేసుకోవచ్చు. అటువంటి స్కీమ్స్ లో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో 50 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు ఏకంగా రూ.31 లక్షల డబ్బుని పొందవచ్చు. ఇంకా ఈ స్పెషల్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వలన మంచి రాబడిని, బోనస్ ని కూడా పొందవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి? అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ పథకం పేరు గ్రామ సురక్ష యోజన పథకం. ఇదొక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో మనం ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. అయితే ఇందులో పెట్టడానికి వయోపరిమితి ఉంది. అంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 19 ఏళ్లలోపు వారు, 55 ఏళ్లు పైబడిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టలేరు. మీరు ఈ పథకంలో కనీసం రూ.10,000 నుండి గరిష్టంగా రూ.10 లక్షల దాకా డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో మనం నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షికంగా పెట్టుబడి పెట్టవచ్చు. అంటే నెలకు, మూడు నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో కనీస ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల టైమ్ ఉంటుంది. ఇక ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు.. ఇలా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు మీరు 19 సంవత్సరాల వయసులో రూ.10 లక్షల ప్రీమియం తీసుకుంటే మీకు 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజకు 50 రూపాయలు కట్టుకుంటే చాలు. అదే.. మీరు 58 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 ప్రీమియం కట్టాలి. 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీరు ఏన్నేళ్లు పెట్టుబడి పెట్టారు అనే దానిని బట్టి మీకు వచ్చే రాబడి ఉంటుంది. మీరు 19 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వరకు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షల డబ్బులు వస్తాయి. ఇక 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు వస్తాయి. అయితే ఈ మెచ్యూరిటీ డబ్బు 80 ఏళ్లు నిండిన తర్వాత మీకు అందుతుంది.

ఒకవేళ ఈ పాలసీ కట్టే సమయంలో మధ్యలో మరణిస్తే.. మీ స్కీమ్, అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం ఆధారంగా నామినీకి చెల్లిస్తారు.ఈ స్కీమ్‌ను తీసుకున్న మూడు సంవత్సరాల తరవాత మీరు ఆపాలనుకుంటే ఆపవచ్చు. ఈ స్కీమ్​లో ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇందులో మీకు బోనస్‌ వస్తుంది. అంటే.. మీరు కట్టే ప్రతి వెయ్యి రూపాయలకు కూడా సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది. ఇదీ సంగతి.. ఈ విధంగా ఈ స్కీమ్ లో మీరు రోజుకి 50 రూపాయలు పొదుపు చేసి 31 లక్షల లాభం పొందవచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments