P Venkatesh
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. ఏమైనా బ్యాంక్ పనులుంటే ముందుగానే చేసుకోండి. ఏయే తేదీల్లో సెలవులు ఉండనున్నాయంటే?
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. ఏమైనా బ్యాంక్ పనులుంటే ముందుగానే చేసుకోండి. ఏయే తేదీల్లో సెలవులు ఉండనున్నాయంటే?
P Venkatesh
మరికొన్ని రోజుల్లో జూన్ నెల ముగిసి జులై నెల ప్రారంభం కానున్నది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకులకు సెలవులు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జులైలో భారీగా బ్యాంకు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో తెలుసుకోకపోతే మీ పనుల్లో జాప్యం జరుగొచ్చు, సమయం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఖాతాకు సంబంధించిన సమస్యలు, డిపాజిట్లు, లోన్స్ ఇలా ఏ అవసరం ఉన్నా కూడా బ్యాంకుకు వెళ్లక తప్పదు. వచ్చే నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
ప్రస్తుత కాలంలో బ్యాంకు సేవలు అన్నీ ఆన్ లైన్ లోనే చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కొన్ని పనులకు బ్యాంకులకు వెళ్లడం తప్పనిసరి. వచ్చే జులై నెలలో జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. వీటిల్లో ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతోపాటు మరికొన్ని రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని జాతీయ సెలవుల రోజు అన్ని బ్యాంకులకు సెలవు ఉండగా.. స్థానిక పండగల్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.