P Venkatesh
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. మీకు బ్యాంకులో ఏమైనా పని ఉంటే ముదుగానే చూసుకోండి. మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఏయే తేదీల్లో అంటే?
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. మీకు బ్యాంకులో ఏమైనా పని ఉంటే ముదుగానే చూసుకోండి. మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఏయే తేదీల్లో అంటే?
P Venkatesh
ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే ఆర్థికసాయం పొందాలన్నా.. సంపాదించినదాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. బ్యాంకుల ద్వారా లోన్ పొందడానికి ఖాతా కలిగి ఉండాల్సిందే. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో వచ్చాక బ్యాంకింగ్ సెక్టార్ అంతా ఆన్ లైన్ మయం అయిపోంది. చాలా రకాల సేవలు ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఖాతాకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్, డెబిట్ కార్టులకు సంబంధించి ఏవైనా వివరాలు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. మరి మే నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఏయే తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయంటే?
మే నెలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు 12 రోజులు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలవులు ఓక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. అయితే బ్యాంకు సెలువులు ఏయే తేదీల్లో ఉన్నాయో తెలుసుకోకపోతే మీకు బ్యాంకులో అర్జెంట్ పనులు ఉంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. మీ సమయం కూడా వృథా అవుతుంది. బ్యాంకులకు మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. మీకు ఏమన్నా పనులు ఉంటే ముందుగానే చేసుకోండి. మే 7న గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో బ్యాంక్ హాలిడే ఉంది. లోక్ సభ ఎన్నికలు ఇందుకు కారణం. మే 8న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉంది. అందువల్ల పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు పని చేయవు.తర్వాత మే 10న అక్షయ తృతీయ ఉంది. కర్నాటకలో బ్యాంక్ హాలిడే ఉంటుంది. అందువల్ల ఆరోజు బ్యాంక్ సెలవు ఉంది. మే 13న లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఆ రోజున ఏపీ, తెలంగాణలో బ్యాంక్ హాలిడే ఉండొచ్చు.