iDreamPost
android-app
ios-app

మహిళలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉమెన్స్ డే గిఫ్ట్.. ఉచితంగా 25 లక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకు భారీ శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఉమెన్స్ డే గిఫ్ట్ అందిస్తూ ఆ అకౌంట్ల ద్వారా ఉచితంగా 25 లక్షలు అందించనుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకు భారీ శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఉమెన్స్ డే గిఫ్ట్ అందిస్తూ ఆ అకౌంట్ల ద్వారా ఉచితంగా 25 లక్షలు అందించనుంది.

మహిళలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉమెన్స్ డే గిఫ్ట్.. ఉచితంగా 25 లక్షలు

వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు మహిళలు. కుటుంబ, ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ తామేంటో నిరూపిస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ ప్రత్యేకమైన రోజును వేడుకలా జరుపుకున్నారు. అయితే ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉమెన్స్ డే గిఫ్టును అందించింది. మహిళల కోసం రెండు ప్రత్యేక అకౌంట్లను ప్రారంభించింది. వీటి ద్వారా చౌకగా లోన్స్, ఇతర ప్రయోజనాలు అందించనున్నారు. అంతేకాదు.. రూ. 25 లక్షల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ డబ్బును తీసుకునే వీలు కల్పిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళల కోసం రెండు స్పెషల్ సేవింగ్స్ అకౌంట్స్ ని ప్రారంభించింది. అవి.. 1. మహిళా శక్తి సేవింగ్స్ అకౌంట్. 2. ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్. ఈ స్పెషల్ అకౌంట్స్ ని మహిళలు జూన్ 30 వరకు ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్స్ ద్వారా డిసెంబర్ 31,2024 వరకు రుణాలు కూడా పొందొచ్చు. అయితే జూన్ 30 వరకు ఓపెన్ చేసిన ఖాతాలకు మాత్రమే బ్యాంక్ ఆఫ్ బరోడా అందించే ప్రయోజనాలు వర్తించనున్నాయి. ఈ ప్రత్యేకమైన అకౌంట్ల ద్వారా విస్తృత ప్రయోజనాలు అందించనుంది.

ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ యొక్క ప్రయోజనాలు:

  • అన్ని రకాల రిటైల్ లోన్లపై 0.25 శాతం వరకు వడ్డీ రాయితీ.
  • ప్రతి రిటైల్ లోన్‌పై పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు.
  • బ్యాంక్ లాకర్ ఫీజుపై 50% వార్షిక తగ్గింపు.
  • ఎస్ఎంఎస్ అలర్ట్, ఆటో స్వీప్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
  • లాకర్ ఫీజులో సంవత్సరానికి 50% తగ్గింపు.
  • రోజుకు రూ.లక్ష వరకు డిపాజిట్లపై ఎలాంటి ఛార్జీ లేదు.
  • అకౌంట్ లో రూ.25 లక్షల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం.
  • రూపే ప్లాటినం డెబిట్ కార్డ్‌పై ఉచిత బీమా, రూ. 2 లక్షల వరకు ప్రమాద కవరేజీ.
  • ప్రతి త్రైమాసికంలో రెండుసార్లు విమానాశ్రయ లాంజ్‌లో ఉండే సౌకర్యం.
  • ఉచిత 50 పేజీల చెక్ బుక్వీ
  • సా వ్యాపారం డీఐ డెబిట్ కార్డ్.
  • జీవితకాల ఉచిత కార్పొరేట్ క్రెడిట్ కార్డ్.
  • అకౌంట్ లో సగటున రూ.10,000 బ్యాలెన్స్ అవసరం.