iDreamPost
android-app
ios-app

మహిళల కోసం బంధన్‌ బ్యాంక్‌ అవని ఖాతా.. ఫ్రీగా 10 లక్షలు పొందొచ్చు

Bandhan Bank: మహిళలకు గుడ్ న్యూస్. బంధన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం స్పెషల్ సేవింగ్ అకౌంట్ ను ప్రారంభించింది. ఈ ఖాతా ద్వారా ఫ్రీగా 10 లక్షలు పొందొచ్చు.

Bandhan Bank: మహిళలకు గుడ్ న్యూస్. బంధన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం స్పెషల్ సేవింగ్ అకౌంట్ ను ప్రారంభించింది. ఈ ఖాతా ద్వారా ఫ్రీగా 10 లక్షలు పొందొచ్చు.

మహిళల కోసం బంధన్‌ బ్యాంక్‌ అవని ఖాతా.. ఫ్రీగా 10 లక్షలు పొందొచ్చు

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు ఖాతాలను యూజ్ చేస్తున్నారు. వివిధ అవసరాల కోసం బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను కూడా కలిగి ఉంటున్నారు. బ్యాంకులు ఖాతాదారుల కోసం ఆఫర్లను, ప్రత్యేక అకౌంట్లను అందిస్తుంటాయి. ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుకు బ్యాంకులు ఈ విధమైన నిర్ణయాలను తీసుకుంటుంటాయి. ఈక్రమంలో బంధన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం స్పెషల్ సేవింగ్ అకౌంట్ ను ప్రారంభించింది. ఈ ఖాతా ద్వారా మహిళలకు ఫ్రీగా డెబిట్ కార్డ్, రూ. 10 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాదా బీమాను కల్పిస్తోంది.

మహిళా ఖాతాదారుల కోసం ‘అవని’ పేరిట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించినట్లు బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. మహిళలకు ఇది గోల్డెన్ ఛాన్స్. బంధన్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ ఖాతా వారికి పలు ప్రయోజనాలను అందిస్తోంది. మీరు కూడా ఈ ప్రయోజనాలను పొందాలంటే బంధన్ బ్యాంక్ అందించే అవని ఖాతాను ఓపెన్ చేయండి. అవని ఖాతా తీసుకున్న వారికి స్పెషల్ డెబిట్ కార్డ్, దీనికి అనుబంధంగా రూ.10లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా, కార్డు పోతే రూ.3.5 లక్షల లయబిలిటీ, ఉచితంగా విమానాశ్రయ లాంజ్‌ ప్రవేశం, లాకర్‌ అద్దె, గోల్డ్ లోన్ ప్రాసెసింగ్‌ ఫీజులపైన 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నెలకు ఉచితంగా 5 లక్షల వరకు నగదు డిపాజిట్ పరిమితిని కల్పిస్తోంది.

Bnadan Bank

కస్టమర్లు సగటు త్రైమాసిక బ్యాలెన్స్ రూ. 25 వేలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతోపాటు బంధన్‌ బ్యాంక్‌ డిలైట్‌ అనే పథకాన్నీ బ్యాంక్‌ ప్రారంభించింది. దీనికింద ఖాతా తెరిచిన వారికి డిలైట్‌ పాయింట్ల పేరిట రివార్డులు అందిస్తుంది. ఈ పాయింట్లను కొనుగోళ్ల కోసం వినియోగించుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రెండు పథకాలనూ ప్రారంభిస్తున్నట్లు తాత్కాలిక మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ రతన్‌ కేశ్‌ తెలిపారు. మహిళల సాధికారత లక్ష్యంతో బంధన్ బ్యాంక్ స్థాపించబడింది. మహిళలకు మరింత చేయూతనందించేందుకే ఈ అవని ఖాతాను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.