iDreamPost
android-app
ios-app

మార్కెట్ లోకి బజాజ్ చేతక్ EV.. బడ్జెట్ ధరలోనే క్రేజీ ఫీచర్లతో

బడ్జెట్ ధరలోనే ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బజాజ్ కంపెనీ సరికొత్త ఈవీని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది ఈ ఈవీ.

బడ్జెట్ ధరలోనే ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బజాజ్ కంపెనీ సరికొత్త ఈవీని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది ఈ ఈవీ.

మార్కెట్ లోకి  బజాజ్ చేతక్ EV.. బడ్జెట్ ధరలోనే క్రేజీ ఫీచర్లతో

వరల్డ్ వైడ్ గా ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, స్కూటర్లు మార్కెట్ లో వాటి హవా కొనసాగిస్తున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అధునాతన ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్లతో వస్తున్న ఈవీలకు వాహనదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకునేందుకు, అదే సమయంలో తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేసే వీలుండడంతో ఈవీలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈవీ ప్రియులకు తాజాగా మరో సరికొత్త ఈవీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసింది.

మీరు బడ్జెట్ ధరలోనే ఈవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే బజాజ్ చేతక్ కొత్త ఈవీ లక్షరూపాయాల్లోనే అందుబాటులో ఉంది. బజాజ్ టూవీలర్స్ కు గతంలో ఫుల్ క్రేజ్ ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే జోష్ తో సరికొత్త ఈవీని మార్కెట్ లోకి విడుదల చేసింది. చేతక్ 2901 వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. దీని ధర రూ. 95,998 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఈవీ రెడ్, వైట్, బ్లాక్‌తో సహా లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ షేడ్స్‌లో వస్తుంది. ఇందులో కలర్ డిజిటల్ కన్సోల్, అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వీటితో పాటు హిల్ హోల్డ్, రివర్స్, స్పోర్ట్, ఎకానమీ మోడ్‌లు, కాల్, మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మి హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను జోడించే టెక్ ప్యాక్ తో రైడర్‌లు తమ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. బజాజ్ చేతక్ 2901 సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 123 కి.మీలు ప్రయాణించొచ్చు. గంటకు 63కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోని మిగతా ఈవీలకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు జూన్ 15 నుంచి డెలివరీలు ప్రారంభంకానున్నాయి.