మార్కెట్ లోకి నయా పల్సర్ బైక్! ఎగబడుతున్న కుర్రాళ్ళు! ధర ఎంతంటే?

పల్సర్ లవర్స్ కు పండగే. మార్కెట్ లోకి మరో కొత్త పల్సర్ బైక్ అందుబాటులోకి వచ్చింది. స్పోర్టీ లుక్, క్రేజీ ఫీచర్లతో యూత్ ను ఆకట్టుకుంటుంది. దీని ధర ఎంతంటే?

పల్సర్ లవర్స్ కు పండగే. మార్కెట్ లోకి మరో కొత్త పల్సర్ బైక్ అందుబాటులోకి వచ్చింది. స్పోర్టీ లుక్, క్రేజీ ఫీచర్లతో యూత్ ను ఆకట్టుకుంటుంది. దీని ధర ఎంతంటే?

మార్కెట్ లో యూత్ ను అట్రాక్ట్ చేసే కేటీఎం, డ్యూక్ వంటి బైకులు ఎన్నీ ఉన్నా పల్సర్ బైకులకు ఉండే క్రేజ్ వేరు. రైడింగ్ ఇష్టపడే వారు పల్సర్ బైక్ లను కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. బజాజ్ నుంచి విడుదలయ్యే పల్సర్ బైకులకు యూత్ ఫిదా అయిపోతుంటారు. స్టన్నింగ్ డిజైన్, స్పోర్టీలుక్, అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు కలిగి ఉండడంతో పల్సర్ బైకులకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్లతో నయా బైకులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నది. తాజాగా మరో కొత్త పల్సర్ బైక్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ కంపెనీ పల్సర్ ఎన్160 బైక్ ని విడుదల చేసింది.

కొత్తగా విడుదలైన పల్సర్ ఎన్160 బైక్ కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. పల్సర్ ఎన్160లో లేటెస్ట్ అప్ డేట్ దాని ఫ్రంట్ యూఎస్డీ ఫోర్క్స్, ఇది బైక్ సస్పెన్షన్ పనితీరును మెరుగుపరుస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ తో(యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మార్కెట్లో ఉన్న ఏకైక 160సీసీ బైక్ ఇదే. ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ను అందించారు. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్ సౌకర్యంతో వస్తుంది. రెడ్, వైట్, బ్లూ, బ్లాక్ వంటి నాలుగు కలర్ ఆప్షన్‌లలో ఈ బైక్ అందుబాటులో ఉంది.

పల్సర్ ఎన్160 బైక్ లో శాంపేన్‌ గోల్డ్‌ 33 ఎమ్‌ఎమ్‌ యూఎస్‌డీ ఫోర్క్స్‌ను ఇందులో జోడించారు. అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్‌ మోడ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్‌ సొంతం. ఈ బైక్‌లో 164.82 సీసీ ఇంజ్‌ను అందించారు. ఇది 8750 ఆర్పీఎం వద్ద 16 హార్స్ పవర్, 6750 ఆర్పీఎం వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. బ్రేకింగ్ కోసం, బైక్ ముందు, వెనక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో ప్రామాణిక డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అందించబడింది.

Show comments