iDreamPost
android-app
ios-app

అదిరిపోయే బిజినెస్.. ATM ఏర్పాటుతో నెలకు రూ.90 వేల ఆదాయం!

అదిరిపోయే బిజినెస్.. ATM ఏర్పాటుతో నెలకు రూ.90 వేల ఆదాయం!

డబ్బు సంపాదనకు మార్గాలు అనేకం. కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తే, మరికొంత మంది వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారం కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే కానీ మంచి ప్రణాళికతో, బిజినెస్ పై నమ్మకంతో ప్రారంభిస్తే విజయం సాధించడం ఖాయం. అయితే ఈ రోజుల్లో యువత ఉద్యోగం కంటే ఎక్కువగా బిజినెస్ చేయడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకరి దగ్గర పనిచేసే కంటే సొంతంగానే ఓ సంస్థను ప్రారంభించి ఉపాధి పొందాలని ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించే వారికి ఓ అదిరిపోయే బిజినెస్ ఐడియా ఉంది. అదేంటంటే.. ఏటీఎం బిజినెస్ ను ప్రారంభించడం. అదేంటీ ఏటీఎం నిర్వహణను బ్యాంకులు చూసుకుంటాయి కదా అంటారా? ఏటీఎం బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఒకప్పుడు నగదు విత్ డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత బ్యాంకింగ్ సేవలు మరింత సులువుగా మారాయి. ఏటీఎం మిషన్లు అందుబాటులోకి వచ్చాక ఏ సమయంలో డబ్బు అవసరమైన క్షణాల్లో తీసుకునే వీలు ఏర్పడింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. అయితే ఈ ఏటీఎంలను బ్యాంకులే కాకుండా ఎవరైనా ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకుని ప్రారంభించ వచ్చును. ఈ బిజినెస్ తో నెలకు రూ. 50 వేల నుంచి రూ. 90 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.

రూ. 5 లక్షల పెట్టుబడితో ఏటీఎం ప్రాంఛైజ్ ను తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. అయితే ఏటీఎంలో కస్టమర్లు జరిపే లావాదేవీల ద్వారా కమీషన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. దీని కోసం ఏటీఎంలో రోజూ 500 వరకు లావాదేవీలు జరగాలి. ప్రతీ నగదు లావాదేవీకి రూ.8, నగదు రహిత లావాదేవీకి రూ.2 కమిషన్ వస్తుంది. కస్టమర్లు బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్‌మెంట్ పొందడం లాంటివన్నీ నగదు రహిత ట్రాన్సాక్షన్స్ కిందకు వస్తాయి. కాగా ఏటీఎం బిజినెస్ స్టార్ట్ చేయడానికి దాదాపు 80 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉండాలి. 100 మీటర్ల పరిధిలో ఏటీఎం ఉండకూడదు. కాంక్రీట్ రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. సొసైటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి. టాటా ఇండీక్యాష్, ఇండియా వన్, ముత్తూట్ లాంటి సంస్థలు ఏటీఎం ఫ్రాంఛైజ్ అందిస్తుంటాయి. మీరు ఒకవేళ ఏటీఎం ప్రాఛైజ్ తీసుకోవాలనుకుంటే సంబంధిత పత్రాలను ఆ బ్యాంకు వెబ్ సైట్ లో పొందుపరిచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి