Kia Sonet AE: కియా సొనెట్ యానివర్సరీ ఎడిషన్ ఫీచర్స్ అదుర్స్!

Kia Sonet AE: కియా కార్లకు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో స్పెషల్ క్రేజ్ ఉంది. చాలా తక్కువ టైంలోనే ఈ కార్లు పాపులర్ అయ్యాయి.

Kia Sonet AE: కియా కార్లకు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో స్పెషల్ క్రేజ్ ఉంది. చాలా తక్కువ టైంలోనే ఈ కార్లు పాపులర్ అయ్యాయి.

సౌత్ కొరియా ఆటోమొబైల్ బ్రాండ్ కియాకు ఇండియాలో డిమాండ్ మాములుగా లేదనే చెప్పాలి..ఆకట్టుకునే డిజైన్ ఇంకా సూపర్ ఫీచర్స్ ఉండటం వలన అందరూ ఈ కార్లను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కార్లలో కియా సోనెట్ మోడల్ బాగా సక్సె అయ్యింది.. దీని నుంచి వచ్చిన యానివర్సరీ ఎడిషన్ చాలా బాగా ఆకట్టుకుంది. ఈ ఎడిషన్ ధర వచ్చేసి 7.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందని కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. కియా సోనెట్ మోడల్ లాంచ్ అయిన 9 నెలల్లోనే ఏకంగా లక్ష పైగా అమ్ముడయ్యాయి. దీంతో ఈ కార్ క్రేజ్ ఏంటో పూర్తిగా అర్ధం చేసుకోవచ్చు. ఈ కార్ చూడ్డానికి ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఇక దీని ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ కార్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5-లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ లేదా 1.0-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. డీజిల్ ఇంజిన్ వచ్చేసి 99 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ ఈ కార్ రన్ అవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లో ఈ కార్ 114 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే 118 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 172 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ క్లచెస్ ఐఎంటీ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ సిస్టం లేదా 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ సిస్టంతో రన్ అవుతుంది.

ఈ కార్ ని మిడ్ స్పెక్ హెచ్ టీఎం ట్రిమ్ తో డిజైన్ చేశారు. ఇందులో డ్రైవర్ కి ప్యాసెంజర్స్ కి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.  ABS & రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. ఇంకా హార్ట్ బీట్ టైల్ లాంప్స్, రియర్ ఏసీ వెంట్స్ తో కూడిన ఎయిర్ కండిషనర్, 8.89 cm (3.5″) మోనో కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ రేర్ వ్యూ మిర్రర్, కీ లెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంపులు, బ్రేక్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా లాంటి ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

Show comments