iDreamPost
android-app
ios-app

గొప్ప మనసు చాటుకున్న అంబానీ వారసుడు.. వారికి రూ. 25 కోట్ల విరాళం

గొప్ప మనసు చాటుకున్న అంబానీ వారసుడు.. వారికి రూ. 25 కోట్ల విరాళం

టెలికాం, డిజిటల్ రంగాల్లో దూసుకెళ్తూ నూతన ఒరవడిని సృష్టించిన రిలయన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా రాణిస్తున్న రిలయన్స్ సామాజిక సేవలో కూడా ముందుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు,పేద ప్రజలను, విద్యార్థులను ఆదుకోవడానికి పలు పథకాలను తీసుకొచ్చి సాయమందిస్తున్నది. ఈ క్రమంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. వారి కోసం ఏకంగా రూ. 25 కోట్లను విరాళంగా అందించారు.రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇంతకీ ఆ 25 కోట్ల విరాళాలు ఎవరి కోసం ఇచ్చారంటే?

కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు అనంత్ అంబానీ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.25 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం సహాయ నిధికి ఈ విరాళాన్ని అందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ క్రమంలోనే తన గొప్ప మనసు చాటుకున్నారు అనంత్ అంబానీ. సీఎం నివాసంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తరపున, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తనయ్ ద్వివేది ఈ విరాళాన్ని అందించారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అనంత్ అంబానీలకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కృతజ్ఞతలు తెలియజేశారు.