iDreamPost

చంద్రబాబుపై సిట్ అధికారుల ప్రశ్నలు ఇవే?

చంద్రబాబుపై సిట్ అధికారుల ప్రశ్నలు ఇవే?

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన ఏపీ సీఐడీ ఆయనను తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించింది. గంట నుంచి సిట్ ఆఫీసులోనే ఉన్న చంద్రబాబు. సిట్ అధికారులు 20 ప్రశ్నలు సంధించనున్నారు. విచారణ సమయంలో చంద్రబాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. దీంతో సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరిస్తారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. విచారణ అనంతరం చంద్రాబాబును విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం మరో కాన్వాయ్‌ను కూడా రెడీ చేశారు సీఐడీ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు.

కాగా సిట్ ఆఫీసులోకి చంద్రబాబు అడ్వకేట్లను అనుమతించని పోలీసులు.ఏ కారణంతో మమ్మల్ని అడ్డుకుంటున్నారని సీఐడీ అధికారులను నిలదీశారు. దీంతో సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు చంద్రబాబు లేఖ రాసారు. నిబంధనలకు విరుద్దంగా దర్యాప్తు అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు బాబు తరఫు న్యాయవాదులు. విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. సిట్ అధికారులు ప్రశ్నించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం చంద్రబాబు తరుపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించనున్న పొన్నవోలు.

సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్కిల్ స్కాంకు సంబంధించి అధికారులు చంద్రబాబు పాత్రపై ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ఆయన దాదాపు ఒకే రకమైన సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి అప్పట్లో ఏం జరిగిందన్న దానిపై సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. అప్పట్లో అధికారులు రాసిన నోట్ ఫైల్స్ ను కూడా చంద్రబాబుకు సీఐడీ అధికారులు చూపించినట్లు సమాచారం. దీనిపై బాబును వివరణ కోరగా, దీనికి చంద్రబాబు తెలీదు, నాకు గుర్తులేదు అనే సమాధానాలే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాలు, హవాలా లావాదేవీలపై అధికారులు వివరించిన సమయంలో ఆయన తడబాటుకు గురైనట్లు సీఐడీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య వాట్సాప్ చాట్ ను కూడా సీఐడీ అధికారులు ఆయనకు చూపించినట్లు సమాచారం. చాటింగ్ గురించి ప్రశ్నించగా చంద్రబాబు తెలీదన్నారు. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పర్చాక సీఐడీ చంద్రబాబు రిమాండ్ తర్వాత కస్టడీ కూడా కోరవచ్చని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి