P Venkatesh
Amazon India: మీరు డెలివరీ పార్ట్ నర్స్ గా వర్క్ చేస్తున్నారా? అయితే మీకు అమెజాన్ గుడ్ న్యూస్ అందించింది. డెలివరీ పార్ట్ నర్స్ కోసం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Amazon India: మీరు డెలివరీ పార్ట్ నర్స్ గా వర్క్ చేస్తున్నారా? అయితే మీకు అమెజాన్ గుడ్ న్యూస్ అందించింది. డెలివరీ పార్ట్ నర్స్ కోసం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
P Venkatesh
ఈ కామర్స్ సంస్థల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్ చేసుకునే సౌకర్యం ఉండడంతో డెలివరీ పార్ట్ నర్స్ గా వర్క్ చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల్లో డెలివరీ పార్ట్ నర్స్ గా చేరి ఉపాధి పొందతున్నారు. మరి మీరు కూడా అమెజాన్ లో డెలివరీ పార్ట్ నర్ గా వర్క్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ పార్ట్ నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
డెలివరీ పార్ట్ నర్స్ కస్టమర్లకు టైమ్ కు వారి ఆర్డర్లను అందించడానికి విశ్రాంతి లేకుండా వర్క్ చేస్తుంటారు. ఎండా, వాన అనే తేడా లేకుండా గంటల తరబడి తిరుగుతూ ఆర్డర్లను పంపిణీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అమెజాన్ డెలివరీ పార్ట్ నర్స్ కు తీపికబురును అందించింది. వారి కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశ వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్ రూమ్స్ సౌకర్యాలు విశ్రాంతి కేంద్రాల్లో కల్పించనున్నారు.
ముందుగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో ఈ విశ్రాంతి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నగరాల్లో విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది తమ ప్లాన్ అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ పార్ట్ నర్స్ కూడా ఈ కేంద్రాల్లో రెస్ట్ తీసుకోవచ్చని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉంటాయని 30 నిమిషాల పాటు డెలివరీ పార్ట్ నర్స్ రెస్ట్ తీసుకోవచ్చని తెలిపారు.