Dharani
Akshya Tritiya 2024: అక్షయ తృతీయ వేళ బంగారం కొనడం మీకు సెంటిమెంటా.. అయితే డబ్బుల్లేవా.. బాధపడకండి.. కేవలం 11 రూపాయలకు కూడా గోల్డ్ కొనవచ్చు. ఎలా అంటే..
Akshya Tritiya 2024: అక్షయ తృతీయ వేళ బంగారం కొనడం మీకు సెంటిమెంటా.. అయితే డబ్బుల్లేవా.. బాధపడకండి.. కేవలం 11 రూపాయలకు కూడా గోల్డ్ కొనవచ్చు. ఎలా అంటే..
Dharani
అక్షయ తృతీయ పండుగ నేడు. ఈ పర్వదినం రోజున బంగారం కొంటే కలిసి వస్తుందని చాలా మంది భావిస్తారు. దాంతో నేడు పసిడికి భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఇక గత కొంత కాలంగా పెరుగుతున్న గోల్డ్ రేటు.. ఈ నాలుగైదు రోజుల నుంచి ఒడిదుడుకులకు గురవుతుంది. రెండ్రోజులు తగ్గితే.. ఆ వెంటనే పెరుగుతోంది. ఇక నేడు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధర దిగి వచ్చింది. ఇక ఇప్పటికే అక్షయ తృతీయ సందర్భంగా తమ వ్యాపారం పెంచుకోవడం కోసం జ్యువెలరీ కంపెనీలన్ని భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మీరు కూడా అక్షయ తృతీయ సెంటిమెంట్ ఫాలో అవుతారా.. బంగారం కొనాలని ఉన్నా చేతిలో డబ్బు లేదా.. అయితే మీ కోసమే ఈ ఆఫర్. కేవలం 11 రూపాయలకే గోల్డ్ కొనే ఛాన్స్. దీనిలో ఎలాంటి మోసం లేదు. మరి ఎలా కొనాలంటే..
మీరు అక్షయ తృతీయ సెంటిమెంట్ ఫాలో అయితే.. మీ దగ్గర డబ్బులు లేకపోతే.. కేవలం 11 రూపాయలకే గోల్డ్ కొనే అవకాశం ఉంది. ఎలా అంటే.. డిజిటల్ రూపంలో. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలో ఆన్‌లైన్‌లో డిజిటిల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దీనిలో మీరు స్వచ్ఛమైన 24 క్యారెట్ గోల్డ్‌నే కొనుగోలు చేస్తారు. ఇందులో ఎలాంటి మోసం లేదు. 11 రూపాయలే ఎందుకంటే.. మన దగ్గర 101 రూపాయలు, 116 చెల్లించడం ఆనవాయితీ. అలానే మీరు కూడా పండుగ పూట సెంటిమెంట్ ప్రకారం.. 11 రూపాయలతో గోల్డ్ కొనండి. ఇంతకు ఈ డిజిటల్ పసిడిని ఎలా కొనాలంటే..
మీకు పేటీఎం యాప్ లేకపోతే ముందుగా మీ ఫోన్‌లో ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ ఖాతాకు పేటీఎంని కూడా లింక్ చేయవచ్చు. బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం ద్వారా, షాపింగ్ సులభం అవుతుంది. ఇక ఇప్పుడు మీరు పేటీఎం యాప్ హోమ్‌పేజీలోని సెర్చ్ బార్‌లో గోల్డ్ అని వెతకాలి. అప్పుడు మీకు బంగారం ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు పేటీఎం గోల్డ్ పేజీకి వెళతారు. ఇక్కడ మీకు నేటి పసిడి ధర కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన లేదా ఎంత మొత్తానికి పుత్తడి కొనాలనుకుంటున్నారో.. ఆ మొత్తాన్ని ఎంటర్ చేయగానే.. మీరు ఎన్ని గ్రాముల బంగారం పొందుతారో తెలుస్తుంది. అలాకాకుండా గ్రాములను ముందుగా మెన్షన్ చేస్తే.. ఆ తర్వాత మీరు ఎంత మొత్తం చెల్లించాలో పక్కనే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బంగారం కొనడానికి డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత మీ గోల్డ్ బ్యాలెన్స్ మీ పేటీఎంలో కనిపిస్తుంది.