iDreamPost
android-app
ios-app

ఆన్ లైన్ లో చాక్లెట్ సిరప్ ఆర్డర్ చేస్తే.. ఎలుక వచ్చింది!

  • Published Jun 19, 2024 | 7:46 PM Updated Updated Jun 19, 2024 | 7:46 PM

తాజాగా ఓ మహిళ ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫామ్ లో హెర్షే చాక్లెట్ సిరప్‌ని ఆర్డర్ చేసింది. ఇక ఆర్డర్ వచ్చాక తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా ఓ మహిళ ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫామ్ లో హెర్షే చాక్లెట్ సిరప్‌ని ఆర్డర్ చేసింది. ఇక ఆర్డర్ వచ్చాక తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 19, 2024 | 7:46 PMUpdated Jun 19, 2024 | 7:46 PM
ఆన్ లైన్ లో చాక్లెట్ సిరప్ ఆర్డర్ చేస్తే.. ఎలుక వచ్చింది!

ఈ మధ్య కాలంలో బయట ఏ ఫుడ్ కొనాలన్నా.. ఏం తినాలన్నా చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఫుడ్ దగ్గర నుంచి స్టార్ హోటల్స్ వరకు అక్కడ ఫుడ్ విషయంలో జరుగుతున్న ఆరాచకాలు చూస్తుంటే.. ప్రతిఒక్కరికి ఒళ్లు జలదరిస్తుంది. ఎందుకంటే.. ఇష్టంగా ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింకలు, పాములు, ఎలుకలు, మనిషి వేళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకట రెండో ఎన్నో ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. మరొపక్క హోటల్స్ లో అయితే కుళ్లిపోయిన చికెన్, కాలం తీరిన ఫుడ్ ప్రొడక్ట్స్, శుభ్రత లేని పాచి పట్టిన పాత్రలతో వంటకాలు దర్శనమిస్తున్నాయి. ఇక వాటన్నింటిని చూసి బయట తినడం కన్నా.. ఇంట్లో తినడం మేలు అని అనిపిస్తుంది. అయినా చాలామంది ఫుడ్ లవర్స్ కు బయట దొరికే స్పెషల్స్ ఇంట్లో దొరకవనే భావన ఉంటుంది. అందుకే ఏదో ఒక డిష్ ను ఆన్ లైన్ ఆర్డర్ పెడుతుంటారు. ఈ క్రమంలోనే.. ఓ మహిళ కూడా తనకు ఇష్టమైన చాక్లెట్ సిరప్ బాటిల్‌ ను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది. కానీ, అందులో తనకు కనిపించే దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా  ప్రమీ శ్రీధర్  ఓ మహిళ ఎంతో ఇష్టంగా ఆన్ లైన్ డెలివరీ సంస్థ అయినా జెప్టోలో హెర్షే చాక్లెట్ సిరప్ ను ఆర్డర్ పెట్టింది. ఇక ఆర్డర్ పెట్టిన కొద్ది నిమిషాలకే తనకు నచ్చిన డిష్ ఇంటికి డెలవరీ అయింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే దానిని తెరిచి తిందామనుకునే లోపే.. ఆ చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ మహిళ దానిని వీడియో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  కాగా, అందులో జెప్టో ఆర్డర్ లో షాకింగ్ సంఘటన ఒకటి చోటుచేసుకుందని  ఆ మహిళ వివరించారు. అయితే హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి జెప్టోలో ఆర్డర్ చేశామని, కానీ, కేక్ పై ఆ సిరప్  పోస్తుండగా.. నల్లని వెంట్రుకల లాంటి పదార్థం వచ్చిందని, ఈ క్రమంలో సిరప్ ను డిస్పోజబుల్ గ్లాసులో పోసి చూడగా చనిపోయిన ఎలుకగా గుర్తించామన్నారు.

ఇక ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు హెర్షీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె ఫిర్యాదుపై కంపెనీ స్పందించింది.  వెంటనే హెర్షీ కంపెనీ బ్రాండ్ ఇలా రాసుకొచ్చింది. “హాయ్, దీన్ని చూసి మేము చాలా చింతిస్తున్నాము. దయచేసి మాకు యూపీసీ, తయారీ కోడ్‌ను బాటిల్ నుంచి రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపండి, తద్వారా మా బృంద సభ్యులలో ఒకరు మీకు సహాయం చేయగలరు అంటూ హెర్షీ కంపెనీ సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రమీ శ్రీధర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వీడియో పోస్ట్ చేసి దాని కింద వివరాలను వెల్లడించారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హెర్షే కంపెనీపై దావా వేయొచ్చని, ఆహార భద్రత డిపార్టుమెంట్ వారికి ఫిర్యాదు చేయొచ్చని ఓ నెటిజన్ చెప్పారు.  మరి, జెప్టో లో ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.