iDreamPost
android-app
ios-app

లాభాలనిచ్చే పోస్టాఫీస్ స్కీమ్.. 5 వేల పెట్టుబడితో చేతికి 8 లక్షలు..

Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను అందుకోవచ్చు. 5 వేల పెట్టుబడితో చేతికి 8 లక్షలు వస్తాయి.

Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను అందుకోవచ్చు. 5 వేల పెట్టుబడితో చేతికి 8 లక్షలు వస్తాయి.

లాభాలనిచ్చే పోస్టాఫీస్ స్కీమ్.. 5 వేల పెట్టుబడితో చేతికి 8 లక్షలు..

ఎప్పుడు కూడా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలను అందుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము వృథా కాకూడదంటే సురక్షితమైన పథాకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అందించే పథకాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ పథకాల్లో పెట్టుబడి భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? లాభాలు అందించే స్కీమ్స్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసం పోస్టాఫీస్ లో అద్భుతమైన స్కీమ్ ఉంది. పెట్టుబడిపై అదిరిపోయే రాబడిని అందిస్తుంది. ఆ స్కీమే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో మీరు నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి చేతికి 8 లక్షలు వస్తాయి.

ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు. ఎక్కువ మొత్తంలో లాభం కావాలనుకుంటే 10 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఇందులో అధిక వడ్డీరేటు పొందొచ్చు. ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు 6.7 శాతం వస్తుంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతాను తెరవవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్ మెంట్ పై ఆధారపడి ఆదాయం వస్తుంది. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో మైనర్ పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. అయితే ఇందులో తల్లిదండ్రులు తమ గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ప్రతి నెలా రూ. 5 వేలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి 60 వేలు అవుతుంది. ఐదు సంవత్సరాలలో మీరు మొత్తం 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై వడ్డీ రేటు 6.7 చొప్పున రూ. 56 వేల 830 వడ్డీ ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం ఫండ్ రూ. 3 లక్షల 56 వేల 830 అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తే, మీరు 10 సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ మొత్తం రూ. 2 లక్షల 54 వేల 272 వస్తుంది. 10 ఏళ్ల మెచ్యూరిటీ కాలానికి మీకు 8 లక్షల 54 వేల, 272 వస్తుంది. పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్లైతే మీరు 8 లక్షలకు పైగా అందుకోవచ్చు.